BREAKING
దీక్షా దివస్ సభ సక్సెస్ కు కౌశిక్ రెడ్డి ప్రచారం నర్సీపట్నంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ భవనానికి శంకుస్థాపన పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గుమ్మిడి దంపతులకు నీలమ్మ కాలనీ సచివాలయ ఉద్యోగులు సత్కారం అలయ్ బలయ్ గోడ ప్రతి ఆవిష్కరణ. ఎస్సీ కమిషన్ సభ్యులను కలిసిన సర్పంచ్ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – జిల్లా కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మున్సిపల్ చైర్ పర్సన్ చింతకాయల పద్మావతి ఆకస్మిక తనిఖీ చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ మేడిపల్లి సత్యం. జడ్పీ చైర్‌పర్సన్ మజ్జి సిరి సహస్త్రను మర్యాదపూర్వకంగా కలిసిన గుమ్మడి సింహాద్రి. నా గెలుపు మరుపెంట పంచాయతీ ప్రజలకే అంకితం! ఎల్‌నినో ముప్పుపై రామగుండం అప్రమత్తం! బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థుల ర్యాలీ జంగులూరు వెలంపాలెం పంచాయతీలో హోరెత్తిన కూటమి ప్రచార జోరు! ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికైన అల్ఫోర్స్ విద్యార్థులు.

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత

Select Suryaa Now
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత

పవన్ కళ్యాణ్ జవాబుదారీతనం పొంగూరు నారాయణ అభివృద్ధి విజన్.. అడిషనల్ కమిషనర్ కె. హిమబిందు పర్యవేక్షణలో 21వ డివిజన్ అభివృద్ధిపై సమీక్ష!


– కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల

నెల్లూరు సిటీ మేజర్ న్యూస్

నెల్లూరు నగరంలోని 21వ డివిజన్ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా అడిషనల్ కమిషనర్ శ్రీమతి కె. హిమబిందు గారి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందితో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల డివిజన్ పరిధిలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రతి వీధిలో పారిశుద్ధ్యం మెరుగుపరచడం, స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సమావేశంలో 21వ డివిజన్ పరిధిలోని సచివాలయ సిబ్బంది పురవిత్ర యాప్ ద్వారా గుర్తించిన సమస్యలు, నమోదు చేసిన ఫిర్యాదులు, వాటి పరిష్కార స్థితిగతులు, పెండింగ్‌లో ఉన్న అంశాలపై అడిషనల్ కమిషనర్ కె. హిమబిందు గారు సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి, పరిష్కారానికి నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సిబ్బందికి సూచించారు. ప్రధానంగా అండర్ డ్రైనేజీ సమస్యలు, రోడ్లపై ఏర్పడిన గుంతలకు ప్యాచ్‌వర్క్, ఎండ్ టు ఎండ్ రోడ్ల నిర్మాణం, ఎత్తుపల్లాలు లేని రహదారులు, కాలువలు లేని ప్రాంతాల్లో కొత్త కాలువల నిర్మాణం, శానిటేషన్, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. నెల్లూరు నగరాన్ని సుందరమైన, అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దాలనే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే శ్రీ పొంగూరు నారాయణ గారి అభివృద్ధి దృక్పథానికి అనుగుణంగా 21వ డివిజన్‌లో కూడా అభివృద్ధి పనులు వేగవంతం కావాలని కోరారు. ప్రతి రహదారి సక్రమంగా ఉండాలని, మురుగునీటి సమస్యలు లేకుండా అవసరమైన చోట కాలువల నిర్మాణం చేపట్టాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణ ఉండాలని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ప్రస్తావించే ప్రజా జవాబుదారీతనం, పారదర్శకత, ప్రజలకు అందుబాటులో ఉండే పాలన అనే స్ఫూర్తితో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడం, వాటిని సంబంధిత అధికారులకు తెలియజేయడం, పరిష్కారం అయ్యే వరకు నిరంతరం పర్యవేక్షించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో డివిజన్‌లో పర్యటించినప్పుడు ప్రజల నుంచి వచ్చిన పలు సమస్యలను అర్జీల రూపంలో డిప్యూటీ అడిషనల్ మేయర్ గారికి అందజేసి, వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. నగర అభివృద్ధికి మంత్రి పొంగూరు నారాయణ  నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రజా జవాబుదారీతనం స్ఫూర్తి, అధికారుల క్షేత్రస్థాయి పర్యవేక్షణ కలిసివచ్చినప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని, 21వ డివిజన్‌ను ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు అందరి సహకారంతో కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, 21వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల, నరహరి, బాలు,ఆమని తదితరులు పాల్గొన్నారు.