BREAKING
ఉత్కలాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గ ఆలయంలో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో హుండీ ప్రారంభం విపత్తు నిర్వహణలో విద్యార్థుల భాగస్వామ్యం అత్యంత కీలకం పశుగ్రాస సాగుకు దరఖాస్తుల ఆహ్వానం కొత్తమ్మతల్లి సేవలో ఖాకీలు రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికైన ఎస్.రాయవరం విద్యార్థినులు! పెనుగొండ వాసవి అమ్మవారి శరన్నవరాత్రులకు ఘన ఏర్పాట్లు ★పది రోజుల పాటు వివిధ అలంకారాల్లో దర్శనం మానసిక ఆరోగ్యంపై అపోహలు వీడాలి! ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రజా సమస్యల వినతులు స్వీకరణ... బీసీలకు ద్రోహం చేసింది వైసీపీనే! చెన్నైలో సీఎం విజయ్‌తో రాహుల్ గాంధీ భేటీ ఢిల్లీలో సీఈసీపై నిరసనల వేళ.. నీలంకరైలోని నివాసంలో గంటపాటు ఏకాంత చర్చలు. జిల్లా జడ్పీ సీఈఓ గా టి.ఎన్.శోభన్ బాబు 25వ రోజుకు చేరిన వి ఆర్ ఏ ల రిలే నిరాహార దీక్ష పాకలపాడు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం – ప్రజలకు అవగాహన కల్పించిన సీఐ రేవతమ్మ

ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్‌

Select Suryaa Now
ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన తర్వాతే  ఎన్నికల నోటిఫికేషన్‌

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా

ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :

రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాతే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ నోటిఫికేషన్‌ విడుదల సమయానికి రాష్ట్రంలో ‘సర్‌’ ప్రక్రియ పూర్తయితే, కొత్త ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. లేదంటే ప్రస్తుత ఓటర్ల జాబితానే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. రిజర్వేషన్లు ఖరారైన తర్వాత రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి, ఆ తర్వాత నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు చెప్పారు.

3 దశల్లో పంచాయతీ ఎన్నికలు: రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 దశల్లో నిర్వహించాలని నిర్ణయించింది. పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు మాత్రం ఒక దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అనిల్‌చంద్ర పునేఠా తెలిపారు. స్థానిక ఎన్నికలకు సన్నద్ధతపై కలెక్టర్లు, ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లతో ఎస్‌ఈసీ విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఒకే దశలో అయితే బందోబస్తు పరంగా ఇబ్బందులు ఉంటాయని, రెండు దశల్లో నిర్వహించాని 10 జిల్లాల ఎస్పీలు విజ్ఞప్తి చేశారు. దీనిపై పరిశీలించి నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఎస్‌ఈసీ చెప్పారు.

నోటిఫికేషన్‌ వెలువడిన 14 రోజుల్లోనే: ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన రోజు నుంచి 14 రోజుల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలని నిర్ణయించారు. పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి, ఫలితాలను ప్రకటిస్తారు. పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలు నోటిఫికేషన్‌ నుంచి 15 రోజుల్లో, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 16 రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. పోలింగ్‌ ముగిసిన రెండు రోజుల తర్వాత వీటిలో ఓట్లు లెక్కించనున్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా, మిగిలినవన్నీ పార్టీ పరంగా నిర్వహిస్తారు. నోటిఫికేషన్, ఎన్నికల షెడ్యూల్‌ ఏది ముందు వెలువడితే, అదే రోజు నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుంది.

అన్ని జిల్లాల్లోనూ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉందని ఎస్ఈసీ అన్నారు. ఓటర్ల జాబితాలు, పోలింగ్‌ కేంద్రాలు, బ్యాలెట్‌ బాక్స్‌లు, మెటీరియల్‌ సిద్ధం చేశామని చెప్పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 2 దశల్లో నిర్వహించాలన్న సూచనలు పరిశీలించి తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు.