పూసపాటిరేగ మండలంలో 69.78 శాతం ఎన్నికల పోలింగ్
పూసపాటిరేగ, సూర్య : మండలంలోని జడ్పిటిసి, ఎంపీటీసీ స్థానాలు గాను జరిగిన ఎన్నికల్లో 69.78 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును గురువారం వినియోగించుకున్నారు. మండలంలో ఉన్న 72 పోలింగ్ కేంద్రాలలో మొత్తం 80,160 మంది ఓటర్లకు గాను 41,995 ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు20,062 మందు ఓటు హక్కును వినియోగించుకోగా,21,932 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంలో పురుషులపై ఆదిత్యత సాధించారు. అయితే ఓటర్లు ఇంకా బారులు తీరి ఉండడంతో సాయంత్రం ఐదు గంటల సమయంలో మిగిలిపోయిన చౌడువాడ, రెల్లి వలస, వెంపడం పోలింగ్ కేంద్రాలలో ఉన్నవారికి ఎన్నికల అధికారి సిబ్బంది టోకెన్ సిస్టంలో ప్రవేశపెట్టి వారందరికీ ప్లడ్లైట్ల మధ్య రాత్రి సమయంలో కూడా ఎన్నికల నిర్వహణ కొనసాగింది. పూసపాటి రేగ లో మాత్రం ముందు రోజు వర్షం పడడంతో బురదమయం అయినప్పటికీ అధికారులు కనీసం గ్రావెల్ కూడా వేసేందుకు చర్యలు తీసుకోకపోవడంతో గ్రౌండ్ లో ఉన్న బురదను దాటుకొని వెళ్లి ఓట్లు వేయడం ఓటర్లకు పెద్ద సమస్యగా మారింది. వృద్ధులు, దివ్యాంగులు వంటి వారు ఆ బురదను దాటుకొని వెళ్లడం మరింత నరకాన్ని చెవి చూడాల్సి వచ్చింది.