BREAKING
బుచ్చిలో ప్రశాంతంగా స్థానిక సంస్థల ఎన్నికలు అథియా శెట్టి పుట్టినరోజు: జీవితంలో నువ్వే నా అతిపెద్ద వరం అంటూ కేఎల్ రాహుల్ ప్రత్యేక పోస్ట్ ఘనంగా కృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం ఓటు హక్కును వినియోగించుకున్న మేకపాటి కుటుంబం ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఎంతో భయపడ్డాను: ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ ఎవరూ లేరంటూ శోభిత ధూళిపాళ కామెంట్స్ పొదలకూరులో పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ–టీడీపీ వర్గాల ఘర్షణ నెల్లిమర్ల మండలంలో ప్రశాంతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు * 82.23 శాతం పోలింగ్ నమోదు * శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్‌పర్సన్ ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదిన వేడుకలు.. నేడు కమ్మ భవన్ శ్రీ చైతన్య విద్యాసంస్థలో రక్తదాన శిబిరం.. ఏజీఎం సుబ్బారెడ్డి వెల్లడి పొదలకూరులో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల.. పూసపాటిరేగ మండలంలో 69.78 శాతం ఎన్నికల పోలింగ్ కూర్చోడానికి కుర్చీలు కూడా వేయలేదు! కైకేయి పాత్రపై లారా దత్తా భావోద్వేగ వ్యాఖ్యలు: చరిత్రలోనే అత్యంత అన్యార్థానికి గురైన మహిళ అంటూ కామెంట్ ఎన్నికల ఎఫెక్ట్‌.. ప్రయాణికులకు పాట్లు! ఉత్తరంలో గెలిచిన కార్పొరేటర్లను అభినందించిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎంపీ శ్రీ భరత్.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నేతలు

పొదలకూరులో పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ–టీడీపీ వర్గాల ఘర్షణ

Select Suryaa Now
పొదలకూరులో పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ–టీడీపీ వర్గాల ఘర్షణ

పొదలకూరు,  మేజర్ న్యూస్ :   సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో పరిషత్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పొదలకూరులోని బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద జెడ్పీటీసీ, ఎంపీటీసీ బిట్‌-2కు సంబంధించి వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలింగ్ ఏజెంట్ల నియామకానికి సంబంధించి ఇరుపార్టీల అభ్యర్థులు, కార్యకర్తల మధ్య మొదలైన వాగ్వాదం కాస్తా తోపులాటకు దారితీసింది. ఒక దశలో పోలీసులు సైతం పరిస్థితిని అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న పొదలకూరు సీఐ అదనపు పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని గుంపులుగా చేరిన నాయకులు, కార్యకర్తలను చెదరగొట్టారు. దీంతో సుమారు అరగంట పాటు నిలిచిపోయిన పోలింగ్ ప్రక్రియను పోలీసులు తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు.కాగా, పొదలకూరును అధికారులు సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలను జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల గురువారం పరిశీలించారు. తాజా ఘర్షణ నేపథ్యంలో కొద్దిసేపట్లో జిల్లా కలెక్టర్ సైతం పోలింగ్ కేంద్రాన్ని సందర్శించనున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు.