BREAKING
మండలంలో కూటమి విజయం తథ్యం. తెదేపా జడ్పిటిసి అభ్యర్థి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి కరణ్ జోహార్ తీరుపై నటి రెజీనా క్యాస్డ్రా సంచలన ప్రశ్నలు: నార్త్ - సౌత్ వివాదంపై కీలక వ్యాఖ్యలు కావలి నియోజకవర్గంలో అభివృద్ధి అంశమే ప్రధాన చర్చ.. కూటమి నేతల ధీమా! బుచ్చిలో ప్రశాంతంగా స్థానిక సంస్థల ఎన్నికలు అథియా శెట్టి పుట్టినరోజు: జీవితంలో నువ్వే నా అతిపెద్ద వరం అంటూ కేఎల్ రాహుల్ ప్రత్యేక పోస్ట్ ఘనంగా కృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం ఓటు హక్కును వినియోగించుకున్న మేకపాటి కుటుంబం ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఎంతో భయపడ్డాను: ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ ఎవరూ లేరంటూ శోభిత ధూళిపాళ కామెంట్స్ పొదలకూరులో పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ–టీడీపీ వర్గాల ఘర్షణ నెల్లిమర్ల మండలంలో ప్రశాంతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు * 82.23 శాతం పోలింగ్ నమోదు * శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్‌పర్సన్ ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదిన వేడుకలు.. నేడు కమ్మ భవన్ శ్రీ చైతన్య విద్యాసంస్థలో రక్తదాన శిబిరం.. ఏజీఎం సుబ్బారెడ్డి వెల్లడి పొదలకూరులో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల.. పూసపాటిరేగ మండలంలో 69.78 శాతం ఎన్నికల పోలింగ్ కూర్చోడానికి కుర్చీలు కూడా వేయలేదు! కైకేయి పాత్రపై లారా దత్తా భావోద్వేగ వ్యాఖ్యలు: చరిత్రలోనే అత్యంత అన్యార్థానికి గురైన మహిళ అంటూ కామెంట్

బుచ్చిలో ప్రశాంతంగా స్థానిక సంస్థల ఎన్నికలు

Select Suryaa Now
బుచ్చిలో ప్రశాంతంగా స్థానిక సంస్థల ఎన్నికలు

బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్  :  స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం లో గురువారం జరిగిన ఎంపిటిసి, జడ్ పిటిసి ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు తెలిపారు. మండలంలో మొత్తం 34,670 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 16, 691 మంది, స్త్రీలు 17,979 మంది ఉన్నారు మొత్తం 11 ఎంపిటిసి స్థానాలు, ఒక జడ్ పిటిసి స్థానం ఉండగా వాటిలో జడ్ పి టి సి స్థానం  ఏకగ్రీవం కాగా, అదేవిధంగా 11 ఎంపిటిసి స్థానాలలో రెండు  ఏకగ్రీవం అవడంతో మిగిలిన 9 స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలలో  మొత్తం 22 మంది అభ్యర్థులు  బరిలో నిలిచారు. 39 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగిన పోలింగ్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదేవిధంగా రీ పోలింగ్ కుతావు లేకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి సోమ్లా నాయక్  స్థానిక తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు తో కలిసి అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎంపిడిఓ ఎస్ రంతులయ్య మండలంలోని పెనుబల్లి, కాలయకాగొల్లు తదితర పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. మొత్తం మీద 65 శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. కాగా ఈ ఎన్నికల లెక్కింపు ఈనెల 7వ తేది శనివారం నిర్వహించనున్నారు.