నెల్లిమర్ల మండలంలో ప్రశాంతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు * 82.23 శాతం పోలింగ్ నమోదు *
నెల్లిమర్ల, సూర్య : నెల్లిమర్ల మండలంలో గురువారం జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు చెదురుమదురు సంఘటనలు మినహా మొత్తం మీద ప్రశాంతంగా ముగిశాయి. ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో భారీగా పోలింగ్ శాతం నమోదైంది.
మొత్తం ఓటర్లు: 43,038 మంది ఉండగా
పోలింగ్ కేంద్రాలు: 49
మొత్తం పోలింగ్ శాతం: 82.23% మొయిద విజయరాంపురంలో ఎమ్మెల్సీ డాక్టర్ పి. సురేష్ బాబు తన ఓటు హక్కును వినియోగించుకోగా, కొండవెలగాడలో నూతన పెళ్లికొడుకు ఉత్సాహంగా వచ్చి ఓటు వేశారు. సమయంపోలైన ఓట్లుపోలింగ్ శాతం
ఉదయం 7:00 గంటలకుక్యూ లైన్లలో బారులు తీరిన ఓటర్లు-
ఉదయం 11:00 గంటలకు13,37531.08%
మధ్యాహ్నం 1:00 గంటలకు20,31147.19%
సాయంత్రం 5:00 గంటలకు (చివరికి )35,38882.23% ఎన్నికల సమయంలో కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి:
కొండగుంపాం: ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగి కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్ళింది.
సారిపల్లి: పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు.
కొండ వెలగాడ, దన్నానపేట: పోలింగ్ కేంద్రాల వద్ద ఇరువర్గాలు పరస్పరం తోసుకోవడంతో పోలీసులు అప్రమత్తమై వారిని బయటకు పంపించారు.
పోలీసుల సమయస్ఫూర్తితో పెద్దగా గొడవలు జరగకుండా పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది.