కూర్చోడానికి కుర్చీలు కూడా వేయలేదు!
పొదలకూరు, మేజర్ న్యూస్ : ఎలక్షన్ డ్యూటీ వేశారు.. కనీస వసతులు మరిచారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆరోగ్య శాఖ సిబ్బంది. పొదలకూరు నరసారెడ్డి కాలనీలో ఎలక్షన్ డ్యూటీ వేసిన సంబంధిత సిబ్బందికి కూర్చోడానికి కనీసం కుర్చీలు కూడా వేయలేదు.. అలాగే పోలింగ్ స్టేషన్ పక్కన వీరికి విధులు కేటాయించారు.. కనీసం అక్కడ చెత్తను కూడా శుభ్రం చేయలేదు.. దాంతో ఆరోగ్య శాఖ సిబ్బందే చీపురతో చెత్తను శుభ్రం చేశారు. ఈ ఘటనపై సిబ్బంది తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కనీసం మనుషులుగా కూడా చూడడం లేదని.. పోలింగ్ మొదలై అరగంట అవుతున్న, మెడిసిన్స్ పెట్టుకోవడానికి టేబుల్స్ లేక అరగంట నుండి నిలబడే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.