తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నేతలు
నెల్లూరు, మేజర్ న్యూస్ : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి నెల్లూరు నగర మేయర్ పి. రూప్ కుమార్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందారు. వారితో పాటు కార్పొరేటర్ కువ్వారపు బాలాజీ, తెలుగుదేశం పార్టీ నాయకులు దార్ల వెంకటేశ్వర్లు, కలికి శ్రీధర్ రెడ్డి, నిశ్చల్ కుమార్ రెడ్డి, అచ్చాల శ్రీనివాసులు రెడ్డి, అల్లంపాటి జనార్దన్ రెడ్డి తదితరులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.