బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకున్న మెట్టుకూరు ధనంజయరెడ్డి
రాపూరు, మేజర్ న్యూస్ : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా ఎన్‌డీసీసీ బ్యాంక్ చైర్మన్, రాపూరు–కలువాయి మండలాల టీడీపీ ఇన్‌ఛార్జ్ మెట్టుకూరు ధనంజయరెడ్డి అనంతసాగరం మండలం లింగంగుంట గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రజలు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే కీలకమైన అవకాశం ఓటు అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ప్రాముఖ్యతను గుర్తించి, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వచ్ఛందంగా, బాధ్యతాయుతంగా తమ ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం కావాలంటే ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమని, ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మెట్టుకూరు ధనంజయరెడ్డి తెలిపారు.