BREAKING
నెల్లిమర్ల మండలంలో ప్రశాంతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు * 82.23 శాతం పోలింగ్ నమోదు * శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్‌పర్సన్ ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదిన వేడుకలు.. నేడు కమ్మ భవన్ శ్రీ చైతన్య విద్యాసంస్థలో రక్తదాన శిబిరం.. ఏజీఎం సుబ్బారెడ్డి వెల్లడి పొదలకూరులో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల.. పూసపాటిరేగ మండలంలో 69.78 శాతం ఎన్నికల పోలింగ్ కూర్చోడానికి కుర్చీలు కూడా వేయలేదు! కైకేయి పాత్రపై లారా దత్తా భావోద్వేగ వ్యాఖ్యలు: చరిత్రలోనే అత్యంత అన్యార్థానికి గురైన మహిళ అంటూ కామెంట్ ఎన్నికల ఎఫెక్ట్‌.. ప్రయాణికులకు పాట్లు! ఉత్తరంలో గెలిచిన కార్పొరేటర్లను అభినందించిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎంపీ శ్రీ భరత్.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నేతలు మరాఠీ యాస వివాదంపై స్పందించిన శ్రద్ధా కపూర్: విమర్శలను తాను పట్టించుకోనంటూ కీలక వ్యాఖ్యలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకున్న మెట్టుకూరు ధనంజయరెడ్డి హోలీ 2027 వేడుకల్లో మ్యూజికల్ సునామీ సృష్టించనున్న ప్రముఖ డీజే మార్టిన్ గారిక్స్: భారతదేశంలో 10 నగరాల్లో టూర్ హారర్ జానర్లోకి అడుగుపెడుతున్న నటి భూమి పెడ్నేకర్: జాని దుశ్మన్ చిత్రంలో హాలీవుడ్ స్టంట్ నిపుణుడు సైదాపురం మండలంలో నేదురుమల్లి సుడిగాలి పర్యటన

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి

Select Suryaa Now
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన విశాఖ రేంజ్ ఐజీ  గోపీనాథ్ జట్టి

శ్రీకాకుళం / ఎచ్చెర్ల,  సూర్య : శ్రీకాకుళం జిల్లాలో  ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతోంది. ఎన్నికల బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించేందుకు విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి, జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి క్షేత్రస్థాయిలో భద్రత ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ముందుగా జె.ఆర్.పురం, ఫరీదుపేట, ఒప్పంగి, గార తదితర ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను, ముఖ్యంగా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లు, ఓటర్ల క్యూలైన్ల నిర్వహణ, పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్ట భద్రత కల్పించాలని ఆదేశించారు. ప్రతి ఓటరు ఎలాంటి భయం, ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని, వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు.ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి, మీడియాతో మాట్లాడుతూ, విశాఖ రేంజ్ పరిధితో పాటు శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కొనసాగుతున్నాయని తెలిపారు. జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు, నిరంతర పర్యవేక్షణతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సజావుగా జరుగుతోందని పేర్కొన్నారు. మిగిలిన పోలింగ్ ప్రక్రియ కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా పూర్తయ్యేలా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తోందని వెల్లడించారు. ఈ పర్యటనలో జె.ఆర్.పురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. అవతారం, సీఐ కృష్ణారావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.