BREAKING
ఓటు హక్కును వినియోగించుకున్న మేకపాటి కుటుంబం ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఎంతో భయపడ్డాను: ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ ఎవరూ లేరంటూ శోభిత ధూళిపాళ కామెంట్స్ పొదలకూరులో పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ–టీడీపీ వర్గాల ఘర్షణ నెల్లిమర్ల మండలంలో ప్రశాంతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు * 82.23 శాతం పోలింగ్ నమోదు * శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్‌పర్సన్ ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదిన వేడుకలు.. నేడు కమ్మ భవన్ శ్రీ చైతన్య విద్యాసంస్థలో రక్తదాన శిబిరం.. ఏజీఎం సుబ్బారెడ్డి వెల్లడి పొదలకూరులో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల.. పూసపాటిరేగ మండలంలో 69.78 శాతం ఎన్నికల పోలింగ్ కూర్చోడానికి కుర్చీలు కూడా వేయలేదు! కైకేయి పాత్రపై లారా దత్తా భావోద్వేగ వ్యాఖ్యలు: చరిత్రలోనే అత్యంత అన్యార్థానికి గురైన మహిళ అంటూ కామెంట్ ఎన్నికల ఎఫెక్ట్‌.. ప్రయాణికులకు పాట్లు! ఉత్తరంలో గెలిచిన కార్పొరేటర్లను అభినందించిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎంపీ శ్రీ భరత్.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నేతలు మరాఠీ యాస వివాదంపై స్పందించిన శ్రద్ధా కపూర్: విమర్శలను తాను పట్టించుకోనంటూ కీలక వ్యాఖ్యలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకున్న మెట్టుకూరు ధనంజయరెడ్డి

ఎన్నికల ఎఫెక్ట్‌.. ప్రయాణికులకు పాట్లు!

Select Suryaa Now
ఎన్నికల ఎఫెక్ట్‌.. ప్రయాణికులకు పాట్లు!

రాపూరు,  మేజర్ న్యూస్ :    స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావం ప్రజా రవాణాపై పడటంతో రాపూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం సకాలంలో బస్సు సర్వీసులు అందుబాటులో లేకపోవడంతో బస్టాండ్ ప్రయాణికులు లేక బోసిపోయింది. తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.  ఎన్నికల విధుల నిర్వహణ కోసం బస్సులను వినియోగించడంతో సాధారణ ప్రయాణికులకు సరిపడా సర్వీసులు అందుబాటులో లేకుండా పోయాయని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. అత్యవసర పనులపై వెళ్లాల్సిన వారు సైతం సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల విధులకు బస్సులను కేటాయించే క్రమంలో సాధారణ ప్రయాణికుల అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రజా రవాణా వ్యవస్థకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, బస్సు సర్వీసులను పునరుద్ధరించి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు.  ఎన్నికల విధులకు బస్సులు సరిపోతున్నాయా..? ప్రయాణికుల అవసరాలు పట్టించుకునేది ఎవరు..? అంటూ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.