ఓటు హక్కును వినియోగించుకున్న మేకపాటి కుటుంబం
మర్రిపాడు, మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో గురువారం మేకపాటి కుటుంబం యొక్క స్వగ్రామమైన జిల్లాలోని మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రం రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి మరియు ఉదయగిరి మాజీ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ఓటు వేశారు.