BREAKING
శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్‌పర్సన్ ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదిన వేడుకలు.. నేడు కమ్మ భవన్ శ్రీ చైతన్య విద్యాసంస్థలో రక్తదాన శిబిరం.. ఏజీఎం సుబ్బారెడ్డి వెల్లడి పొదలకూరులో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల.. పూసపాటిరేగ మండలంలో 69.78 శాతం ఎన్నికల పోలింగ్ కూర్చోడానికి కుర్చీలు కూడా వేయలేదు! కైకేయి పాత్రపై లారా దత్తా భావోద్వేగ వ్యాఖ్యలు: చరిత్రలోనే అత్యంత అన్యార్థానికి గురైన మహిళ అంటూ కామెంట్ ఎన్నికల ఎఫెక్ట్‌.. ప్రయాణికులకు పాట్లు! ఉత్తరంలో గెలిచిన కార్పొరేటర్లను అభినందించిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎంపీ శ్రీ భరత్.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నేతలు మరాఠీ యాస వివాదంపై స్పందించిన శ్రద్ధా కపూర్: విమర్శలను తాను పట్టించుకోనంటూ కీలక వ్యాఖ్యలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకున్న మెట్టుకూరు ధనంజయరెడ్డి హోలీ 2027 వేడుకల్లో మ్యూజికల్ సునామీ సృష్టించనున్న ప్రముఖ డీజే మార్టిన్ గారిక్స్: భారతదేశంలో 10 నగరాల్లో టూర్ హారర్ జానర్లోకి అడుగుపెడుతున్న నటి భూమి పెడ్నేకర్: జాని దుశ్మన్ చిత్రంలో హాలీవుడ్ స్టంట్ నిపుణుడు సైదాపురం మండలంలో నేదురుమల్లి సుడిగాలి పర్యటన అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి

అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి

Select Suryaa Now
అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి

 

కర్నూలు, నవంబర్ 05: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ. సిరి ప్రజలకు పిలుపునిచ్చారు.

గురువారం జిల్లాలో నిర్వహిస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్  క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా కోడుమూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దేవనకొండ మండలం కరివేముల గ్రామంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాల, దేవనకొండ మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు, పత్తికొండ మండలం కనకదిన్నె గ్రామంలోని మండల పరిషత్ పాఠశాల, దూదేకొండ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల, పత్తికొండ మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ నిర్వహణను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ తీరును, పోలింగ్ శాతాన్ని, విజిట్ షీట్లను, సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఓటర్లు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో సులభంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ప్రతి ఓటరికి అవసరమైన సహకారం అందిస్తూ, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని ఎన్నికల నిబంధనల ప్రకారం పటిష్ట పోలీసు భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించి, భద్రపరిచే ప్రక్రియను అత్యంత అప్రమత్తంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ తనిఖీల్లో ఆదోని ఆర్డీవో అరుణ దేవి, సంబంధిత ఎన్నికల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.