కావలి నియోజకవర్గంలో అభివృద్ధి అంశమే ప్రధాన చర్చ.. కూటమి నేతల ధీమా!
కావలి , మేజర్ న్యూస్ : కావలి నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా అభివృద్ధి అంశం ప్రధాన చర్చగా మారిందని కూటమి నాయకులు పేర్కొంటున్నారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం ప్రజల్లో కనిపించిందని వారు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గంలోని అన్ని సెగ్మెంట్లలో కూటమి అభ్యర్థులకు మెజార్టీ వస్తుందని కూటమి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలపై చర్చ జరుగుతోందని పేర్కొంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతుగా ఓటు వేశామంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని కూటమి శ్రేణులు చెబుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో అభివృద్ధిని ప్రధాన అంశంగా ప్రస్తావించిన కూటమి నాయకులు, ప్రజల తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం ప్రజాభిప్రాయం స్పష్టంకానుంది.