పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించిన సీఐ వాసు నాయుడు
గాజువాక, సూర్య : త్వరలో జరగనున్న జీవీఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను సీఐ సీహెచ్. వాసు నాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన విద్యుత్, తాగునీటి సదుపాయాలతో పాటు దివ్యాంగుల రాకపోకల కోసం ఏర్పాటు చేసిన ర్యాంపులు, ప్రవేశ-నిష్క్రమణ మార్గాలను ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, ఎన్నికల విధుల్లో సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఓటర్లు ఎటువంటి అసౌకర్యం లేకుండా తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొంటూ, ఎన్నికల నిబంధనలను పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని ప్రజలను కోరారు.
రిపోర్టర్ : కోటి రెడ్డి, గాజువాక, విశాఖపట్నం.