BREAKING
అమ్మవారి సన్నిధిలో సుప్రీం జస్టిస్ ప్రశాంత్ మిశ్రా జగన్మాతను దర్శించుకున్న సుప్రీం జస్టిస్ భట్టి పాతపట్నం మేజర్ పంచాయతీలో సైలాడ సతీష్ ప్రభంజనం!. కార్తీక వన సమారాధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి : తుమ్మలపల్లి హరికృష్ణ గొల్లపల్లి సర్పంచ్ గా చొక్కా రెడ్డి గారి గీత క్రైస్తవ మత పెద్దలకు కార్పొరేటర్ గోవింద్ కృతజ్ఞతలు కంకిపాడు పోలింగ్ కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం.. అయ్యప్పల నిత్య అన్నదానానికి విశేష స్పందన గురునాథ్ ఆధ్వర్యంలో పదో వార్డు టిడిపి నేతలతో సమావేశం.... ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అవగాహనకు సైక్లథాన్ *రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలి * దేశీయ నోట్‌బుక్ పరిశ్రమకు జీఎస్టీ భారం తగ్గించాలి కార్పొరేటర్ ఏడువాక దంపతులకు ఘన సన్మానం శ్రీకొండలమ్మను దర్శించుకున్న 7 వేలమంది భక్తులు

పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు కు సదుపాయాలు కల్పించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి

Select Suryaa Now
 పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు కు  సదుపాయాలు కల్పించాలి  : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి

అమృతలూరు, మేజర్ న్యూస్‌ 

: ఓటు ఉన్న  ప్రతి ఒక్కరు  పంచాయతీ ఎన్నికల లో ఓటు హక్కువినోయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్,వి., పేర్కొన్నారు.

2 వ సాధారణ స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికలలో బాగంగా   29 న ఆదివారం  జరగనున్న పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి శనివారం అమృతలూరు,మండలం,మూల్పూరు గ్రామం  మండల ప్రాథమిక పరిషత్ మరియు జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల లో ఏర్పాటు చేసిన 14 పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి., పరిశీలించారు.

ఈ సందర్భంగా రెండవ సాధారణ స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా    నేడు అమృతులూరు మండల పరిధిలోని మూల్పూరు గ్రామం నందు   జరగనున్న పంచాయతీ  ఎన్నికలకు  ఏర్పాటు చేసిన 14 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, ఫర్నిచర్, ర్యాంపులు వంటి సదుపాయాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగ ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని, పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలుచోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆనంతరం మూల్పూరు గ్రామం మండల ప్రజా పరిషత్, పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సందర్భంగా అక్కడ ఉన్న ఓటర్ల తో కలెక్టర్ మాట్లాడుతూ మీ పేరు ఓటర్ జాబితాలో మీ పేరు ఉందా చూచుకున్నారా,ఓటర్ స్లిప్స్ ఇచ్చారని మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని మీరు అందరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని వారికి సూచించారు.

జిల్లా కలెక్టర్ వెంట రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారిణి బి.శ్రీదేవి, తహశీల్దార్  ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి, వీఆర్వోలు తదితరులు ఉన్నారు.