పోలేరమ్మ తొలిదర్శనం వేలంపాట నగదు అందజేత
పొదలకూరు, మేజర్ న్యూస్ : రూ.30 వేలకు తొలి దర్శనం దక్కించుకున్న మన్నెం శ్యాం ప్రసాద్ సుమారు 90 ఏళ్ల తర్వాత అత్యంత వైభవంగా నిర్వహించిన పొదలకూరు పోలేరమ్మ జాతర వేడుకలు భక్తుల్లో చెరగని ముద్ర వేశాయి. జాతర తొలిరోజు అమ్మవారి విగ్రహాన్ని కుమ్మరి ఇంట్లో ప్రతిష్ఠించడం ఆనవాయితీగా వస్తోంది. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం అమ్మవారి తొలిదర్శనం కోసం వేలంపాట నిర్వహించారు. ఈ వేలంలో పట్టణానికి చెందిన మన్నెం శ్యాం ప్రసాద్ రూ.30 వేలకు తొలిదర్శనం దక్కించుకున్నారు. వేలంపాటలో గెలుచుకున్న నగదును శనివారం కుమ్మరి ఇంటి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ విషయాన్ని కుమ్మరి సంఘానికి చెందిన దేవరకొండ చెంచు రామయ్య, దేవరకొండ భాస్కర్ తెలిపారు