పోలేరమ్మ జాతరకు మేయర్ కు ఆహ్వానం
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : పొదలకూరు పోలేరమ్మ జాతరను పురస్కరించుకుని నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్ కు ఆహ్వాన పత్రికను దేవస్థానం కమిటీ సభ్యులు బుధవారం అందజేసి ఆహ్వానించారు. అక్టోబర్ నెల 8 వ తేదీన పొదలకూరులోని పోలేరమ్మ జాతరలో పాల్గొని, అమ్మవారి ఆశీస్సులు పొందాలని కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఆహ్వానించిన వారిలో చొప్ప వెంకటేశ్వర్లు దేవస్థానం కమిటీ సభ్యులు, ఆర్. ధనుంజయ బిజెపి మండల ఉపాధ్యక్షుడు, చింత గింజల సుబ్రహ్మణ్యం స్టేట్ సీనియర్ నాయకులు, చిడతల రంగారావు, కరాటి రత్నయ్య ఉన్నారు.