BREAKING
కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది... ప్రముఖ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఘనంగా భజరప్ప స్మారక పురస్కార ప్రదానం మానవత్వం చాటిన త్రిపురాంతకం తహసిల్దార్ వాసుదేవరావు..... గుమ్మనూరు కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన పామిడి సీఐ పుష్పగుచ్ఛం అందజేసిన నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోహర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్.. ఏఐ ఫేక్ కంటెంట్‌పై సంచలన పిటిషన్ *ఓటు హక్కుపై గళమెత్తిన కాంగ్రెస్‌* ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్యలో మెరిసిన ప్రశాంత్ - బిఆర్ఎవోయు స్నాతకోత్సవంలో బంగారు పతకం

పోలవరం 2027 నాటికి పూర్తి చేయడమే లక్ష్యం.

Select Suryaa Now
పోలవరం 2027 నాటికి పూర్తి చేయడమే లక్ష్యం.

 

•   పోలవరం 2027 నాటికి పూర్తి చేయడమే లక్ష్యం.
•    ఫేజ్–2కు రూ.42,500 కోట్ల సహాయం కోరాం.
•    పోలవరంతో జలరవాణాకు మార్గం సుగమం.
•    గోదావరి–కావేరి అనుసంధానంతో ఐదు రాష్ట్రాలకు ప్రయోజనం.
         -జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.

పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్, ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన సమావేశం సానుకూల వాతావరణంలో జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును నిర్దేశిత గడువులో పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని కేంద్ర ప్రభుత్వం అభినందించిందన్నారు. గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి జలశక్తి సిఆర్.పాటిల్ తో సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమావేశం వివరాలను మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాకు వివరించారు.

పోలవరం పనుల్లో గణనీయమైన పురోగతి.

గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకంగా మార్చడంతో పాటు డయాఫ్రమ్ వాల్‌ను విధ్వంశం చేసిందని మంత్రి నిమ్మల విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని 2027 నాటికి పూర్తి చేయాలనే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనులను వేగవంతం చేసిందన్నారు. ప్రస్తుతం పోలవరం సివిల్ పనులు 88 శాతం, భూసేకరణ, ఆర్అండ్ఆర్ పనులు ఆర్థికంగా 64 శాతం, మొత్తంగా ప్రాజెక్టు భౌతిక పురోగతి 83 శాతం, ఆర్థిక పురోగతి 78 శాతంకు చేరిందని మంత్రి నిమ్మల తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి జలశక్తి మంత్రి పాటిల్‌కు, కేంద్ర ప్రభుత్వానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

ఫేజ్–2కు రూ.42,500 కోట్ల సహాయం కోరాం.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2019కు ముందు ఫేజ్–1, ఫేజ్–2 అనే విభజన లేదని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 2019 ఫిబ్రవరిలోనే టిడిపి ప్రభుత్వం ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.55,548.87 కోట్లకు RCE ఆమోదం పొందిందన్నారు. ప్రస్తుతం 41.15 మీటర్ల కాంటూర్ వరకు ఫేజ్–1లో నీటిని నిల్వ చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు, 45.72 మీటర్ల కాంటూర్ వరకు ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉందన్నారు. మిగిలిన భూసేకరణ, పునరావాసం తదితర అవసరాల కోసం సుమారు రూ.42,500 కోట్ల వరకు అవసరమవుతుందని, ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని కోరినట్లు మంత్రి నిమ్మల తెలిపారు.

పోలవరం చుట్టూ రోడ్ కనెక్టివిటీకి ప్రాధాన్యత.

పోలవరం పూర్తయిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా అభివృద్ధి చెందనున్నందున, మెరుగైన రహదారి కనెక్టివిటీ అవసరమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అమరావతి–ఖరగ్‌పూర్ సిక్స్ లేన్ ఎకనామిక్ కారిడార్ పోలవరం దిగువ నుంచి వెళ్తున్నందున, దాన్ని పోలవరం స్పిల్‌వేకు సుమారు ఒక కిలోమీటర్ సమీపానికి తీసుకురావాలని కోరినట్లు తెలిపారు. అదేవిధంగా NH-365BB కొవ్వూరు, NH-516E రాజమండ్రి, NH-16 రాజానగరం మీదుగా చెన్నై–కోల్‌కతా మార్గాలతో పోలవరానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

పోలవరం స్పిల్‌వేను పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేయాలి.

పోలవరం స్పిల్‌వే సుమారు 1,118 మీటర్ల పొడవు, 48 రేడియల్ గేట్లు, సుమారు 50 లక్షల క్యూసెక్కుల వరదను విడుదల చేయగల సామర్థ్యం కలిగి ఉన్నందున, గోదావరి చరిత్రను ప్రతిబింబించేలా స్పిల్‌వేను అభివృద్ధి చేయాలని కోరినట్లు మంత్రి నిమ్మల తెలిపారు. స్పిల్‌వే వద్ద వ్యూ గ్యాలరీలు, లైటింగ్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసి పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దాలని ప్రతిపాదించినట్లు చెప్పారు.

పోలవరం పరిధిలోని సుమారు 9,900 ఎకరాలను సమగ్ర టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. గోదావరి కొండలు, ప్రకృతి సౌందర్యం, 194 టీఎంసీల భారీ రిజర్వాయర్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉందన్నారు.

జలరవాణాకు మరింత ప్రాధాన్యత.

భద్రాచలం నుంచి రాజమండ్రి, కాకినాడ వరకు జాతీయ జలమార్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 2009లో క్లాస్–3గా నోటిఫై చేసిన ఈ జలమార్గాన్ని కొనసాగిస్తూ విస్తరించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.

గోదావరి–కావేరి అనుసంధానం వేగవంతం చేయాలి.

గోదావరి–కావేరి నదుల అనుసంధానాన్ని బనకచర్ల మీదుగా త్వరితగతిన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గోదావరి నుంచి కావేరికి నీటిని అనుసంధానం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు భవిష్యత్తులో నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి DPRలను వేగంగా సిద్ధం చేసి ముందుకు వెళ్లాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. సూపర్ ఎల్‌నినో పరిస్థితుల్లో కూడా ఈ ఏడాది గోదావరిలో భారీగా వరద నీరు సముద్రంలోకి వెళ్లిందని మంత్రి తెలిపారు. ఒక రోజులోనే సుమారు 122 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లిందని, గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసుకునేలా గోదావరి–కావేరి అనుసంధానం చేపడితే భారీగా నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు.

జలవనరుల రంగంలో విప్లవాత్మక మార్పులు.

గత ప్రభుత్వం ఇరిగేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను ఒక్కొక్కటిగా సరిచేస్తూ, నిలిచిపోయిన ప్రాజెక్టులను తిరిగి పట్టాలెక్కిస్తోందన్నారు. హంద్రీ–నీవా ప్రాజెక్టులో ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేయలేని పనులను కూటమి ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే పూర్తి చేసి 728వ కిలోమీటర్ వరకు కృష్ణా జలాలను తీసుకెళ్లిందని తెలిపారు. అదేవిధంగా మూడు దశాబ్దాల కలగా మిగిలిన వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్–1ను పూర్తి చేసి, ఆగస్టు 31న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కృష్ణా జలాలను ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు తీసుకెళ్లిన విషయాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు గుర్తు చేశారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్‌పై గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కనీసం దృష్టి పెట్టలేదని, కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే సుమారు రూ.1,800 కోట్లు ఖర్చు చేసి పనులను వేగవంతం చేసిందన్నారు. గోదావరి జలాలు ఉత్తరాంధ్ర నేలను తాకేలా చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడిని సిఈవో ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా పిలిచేవారని, ప్రస్తుతం జలవనరుల రంగంలో ఆయన చేస్తున్న కృషి కారణంగా వాటర్ మేన్ గా గుర్తింపు పొందుతున్నారని మంత్రి నిమ్మల తెలిపారు. సాగునీరు, తాగునీరు, జలవనరుల అభివృద్ధిలో రాష్ట్రానికి కొత్త దిశను చూపుతూ కూటమి ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.