BREAKING
గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువ: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎస్పీ బాలుతో ఆ జ్ఞాపకం ఇప్పటికీ మరువలేను.. ఎస్వీ కృష్ణా రెడ్డి ఎమోషనల్ పోస్ట్! చెత్తను సద్వినియోగం చేసుకోవాలి ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు విదేశాలకు వెళ్లే ముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్ లో బ్రిడ్జి వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దసరాకు రాష్ట్రపతి రాక సమగ్ర శిశు అభివృద్ధి సేవలను మరింత బలోపేతం చేయాలి.. : జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్

పోలమాంబ ఆలయంలో "వరుణ యాగం"

Select Suryaa Now
పోలమాంబ ఆలయంలో "వరుణ యాగం"
  • మంగళవారం ఉదయం వనం గుడిలో  
  • సమృద్ధిగా వర్షాలు కురివాలని
  •  ప్రజల సంక్షేమం శ్రేయస్సు కు వరుణ దేవుని ఆశీస్సులు కోసం
  • ఈవో, దవివి సూర్యనారాయణ
    మక్కువ: పార్వతీపురం మన్యం జిల్లా, మక్కువ మండలం, శంబర గ్రామంలో వేంచేసియున్న  ఉత్తరాంధ్రల ఆరాధ్య దైవం శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయంలో వరుణ యాగం నిర్వహించనున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి వివి సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు ఈనెల ఆరవ తేదీ మంగళవారం శ్రీ పోలమాంబ అమ్మవారి వనం గుడిలో ఉదయం 6:54 గంటలకు  వరుణ యాగం, వరుణ జపం నిర్వహించ నున్నట్టు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురివాలని, రాష్ట్ర ప్రజల సంక్షేమం,  శ్రేయస్సు కొరకు వరుణ దేవుని ఆశీస్సులను  పొందుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవదాయ ధర్మదాయశాఖ  కమిషనర్ ఆదేశాల మేరకు వరుణ యాగంతో పాటు, వరుణ జపం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విశిష్ట కార్యక్రమాన్ని ప్రముఖ పండితులు విజయనగరం వాస్తవ్యులు బ్రహ్మశ్రీ కప్పగంతుల శ్రావణ్ కుమార్ తదితరులు నిర్వహించినట్టు ఈవో తెలిపారు. కార్యక్రమానికి పుర ప్రజలు పాల్గొని వరుణ్ దేవుని ఆశీస్సులతో పాటు శ్రీ పాలమాంబ అమ్మవారి కరుణాకటాక్షాలు పొందాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.