BREAKING
సీజనల్ హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం, అక్రమాలకు తావిస్తే కఠిన చర్యలు తప్పవు* *విద్యార్థులకు నాణ్యమైన భోజనం, సురక్షిత వసతి, మెరుగైన విద్యా సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి* *సీజనల్ హాస్టళ్ల నిర్వహణపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం* *జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* రామ్ చరణ్, సుకుమార్ ఆర్సీ17 సినిమాలో నటించే ఛాన్స్.. ఆడిషన్స్ వివరాలు ఇవే! ఆర్పీలకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలి బ్యాంకులపై ప్రజల విశ్వాసాన్ని కాపాడటంలో ఆర్బీఐ కీలక పాత్ర విరాట్ కర్ణ కొత్త సినిమా రుస్తుం టైటిల్ గ్లింప్స్ విడుదల.. పుట్టినరోజు వేళ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కరువు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి ప్రత్యేక పూజలు. చార్మినార్ పరిసర ప్రాంతాలలో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా పోలీసు కమిషనర్ భద్రతా తనిఖీలు హైదరాబాద్‌లో ఆసియా జ్యువెల్స్ షో ప్రారంభం పెద్దవరం గ్రామపంచాయతీ ఎన్నిక ఏకగ్రీవం విజయ్ దేవరకొండ బంగారం లాంటి మనిషి: రష్మికను ప్రభాస్‌తో పోల్చిన రణబాలి సహనటుడు సేవారత్న పురస్కారం అందుకున్న మడిగాల విజయభాస్కర్ రెడ్డి అనుమతి లేని ఏఐ వాడకంపై కఠినంగా ఉండాలి: పర్సనాలిటీ రైట్స్ రక్షణపై అనన్య పాండే కీలక వ్యాఖ్యలు మెల్కోటే పార్క్ లో కార్తీక మాస వనభోజనాలు ఆటో డ్రైవర్ల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలి

పంట ఉత్పత్తులను సురక్షితంగా నిల్వ ఉంచుకోవాలి

Select Suryaa Now
పంట ఉత్పత్తులను సురక్షితంగా నిల్వ ఉంచుకోవాలి

నగరం, మేజర్ న్యూస్:
స్థానిక మండల పరిధిలోని పూడివాడలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో "పంట కోత అనంతరం సాంకేతికత, ఉత్పత్తులను సురక్షితంగా నిల్వ  ఉంచుకునే పద్ధతులు" అనే అంశంపై రైతులకు అవగాహన కల్పించారు. శుక్రవారం పొలంబడి కార్యక్రమంలో 
ఇంచార్జీ రేపల్లె సహాయ వ్యవసాయ సంచాలకులు, స్థానిక మండల వ్యవసాయ అధికారి వేమూరి రమేష్ బాబు పాల్గొని మాట్లాడుతూ రైతు పంట పండించడం వరకే కాదు, పండిన పంటను సరిగ్గా కోసి, ఆరబెట్టి, నిల్వ చేసుకోవడం కూడా చాలా ముఖ్యమని తెలిపారు. రైతులకు సరైన పంట నిల్వ పద్ధతులు తెలియక 10 నుండి 15 శాతం వరకు పంటను నష్టపోతున్నారని వివరించారు. పంట పూర్తిగా ముదిరిన తర్వాతే కోత కోయాలని, ముందుగా కోస్తే గింజ బరువు తగ్గుతుందని, ఆలస్యం చేస్తే గింజ రాలిపోతుందన్నారు. పంటను నిల్వ చేసే ముందు తేమ శాతం తప్పనిసరిగా తగ్గించాలని, వరి ధాన్యానికి 13-14% తేమ, మినుము, పెసరకు 10-11% తేమ ఉంటేనే నిల్వకు అనుకూలంగా ఉంటుందని, తేమ ఎక్కువ ఉంటే పురుగు, బూజు పట్టి పంట పాడవుతుందన్నారు. ధాన్యాన్ని శుభ్రం చేసి, పుచ్చు గింజలు, తాలు తీసేసి గ్రేడింగ్ చేయాలని, గ్రేడింగ్ చేసిన ధాన్యానికి మార్కెట్లో ఎక్కువ ధర వస్తుందని, నేరుగా అమ్ముకుంటే దళారుల మోసం ఉండదని తెలిపారు. పంటను వెంటనే అమ్మకుండా, ధర వచ్చినప్పుడు అమ్ముకోవాలని, అప్పటివరకు గోదాముల్లో నిల్వ చేసుకుని రుణ సౌకర్యం పొందవచ్చని తెలిపారు. ఈ-నామ్, రైతు బజార్లు, ఎఫ్ పి ఓల ద్వారా అమ్ముకుంటే మంచి ధర వస్తుందని వివరించారు. 
కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.