పంచాయతీ ఎన్నికల సిబ్బందికి శిక్షణా కార్యక్రమం
పంచాయతీ ఎన్నికల సిబ్బందికి శిక్షణా కార్యక్రమం
అనుమసముద్రంపేట మేజర్ న్యూస్ ఈనెల 29వ తేదీన ఏఎస్ పేట మండలంలో జరిగే పంచాయితీ ఎన్నికల్లో ఎన్నికల అధికారులకు సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీడీవో పి ప్రసన్నకుమారి నిర్వహించారు ఏ ఎస్ పేట లోనిఏపీ మాడల్ పాఠశాల యందు ఉద్యోగులకు పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆఫీసర్స్, ఎన్నికల నిర్వహణ గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమం యందు మాష్టర్ ట్రైనర్లు ఉపాధ్యాయులు షేక్.విక్రమ్ రాహుల్ , యు.శ్రీనివాసులు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ కోటేశ్వరరావు , ఎంపిడివో ప్రసన్నకుమారి, తహసిల్దారు వెంకటేశ్వర్లు మండల విద్యాశాఖ అధికారులు ఎం జ్యోతి , డి సాయిప్రసాద్ హాజరైనారు