BREAKING
పాతపట్నం మేజర్ పంచాయతీలో సైలాడ సతీష్ ప్రభంజనం!. పాతపట్నం మేజర్ పంచాయతీలో సైలాడ సతీష్ ప్రభంజనం. కార్తీక వన సమారాధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి : తుమ్మలపల్లి హరికృష్ణ గొల్లపల్లి సర్పంచ్ గా చొక్కా రెడ్డి గారి గీత క్రైస్తవ మత పెద్దలకు కార్పొరేటర్ గోవింద్ కృతజ్ఞతలు కంకిపాడు పోలింగ్ కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం.. అయ్యప్పల నిత్య అన్నదానానికి విశేష స్పందన గురునాథ్ ఆధ్వర్యంలో పదో వార్డు టిడిపి నేతలతో సమావేశం.... ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అవగాహనకు సైక్లథాన్ *రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలి * దేశీయ నోట్‌బుక్ పరిశ్రమకు జీఎస్టీ భారం తగ్గించాలి కార్పొరేటర్ ఏడువాక దంపతులకు ఘన సన్మానం శ్రీకొండలమ్మను దర్శించుకున్న 7 వేలమంది భక్తులు భారత్–శ్రీలంక వన్డే టికెట్ల విక్రయానికి ముహూర్తం ఖరారు

పిక్కిలివానిపల్లిలో పూలబాట.. లక్ష్మిదేవమ్మకు జననీరాజనం లక్ష్మీనగరం సర్పంచ్ అభ్యర్థి ముమ్మర ప్రచారం అడుగడుగునా మేళతాళాలతో ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు

Select Suryaa Now
పిక్కిలివానిపల్లిలో పూలబాట.. లక్ష్మిదేవమ్మకు జననీరాజనం లక్ష్మీనగరం సర్పంచ్ అభ్యర్థి ముమ్మర ప్రచారం అడుగడుగునా మేళతాళాలతో ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు

వెల్దుర్తి,  మేజర్ న్యూస్: లక్ష్మీనగరం గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీపీ, వైకాపా మద్దతుతో బరిలో నిలిచిన సర్పంచి అభ్యర్థి దేశాయి లక్ష్మిదేవమ్మ దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి మజరా గ్రామమైన పిక్కిలివానిపల్లిలో ఆమె విస్తృతంగా పర్యటించారు. తన కుటుంబ సభ్యులు దేశాయి నరేంద్రరెడ్డి, దేశాయి సమీర్‌కుమార్‌రెడ్డిలతో కలిసి గ్రామంలోకి అడుగుపెట్టిన లక్ష్మిదేవమ్మకు ప్రజలు, వైకాపా శ్రేణులు అడుగడుగునా పూలు చల్లుతూ, మేళతాళాలు, బాణసంచా మోతలతో ఘనస్వాగతం పలికారు.ముందుగా గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్న లక్ష్మిదేవమ్మ, కుటుంబ సభ్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని ప్రతి వీధిలో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ఆప్యాయంగా పలకరించారు. గతంలో ఎంపీపీగా తాను చేసిన సేవలను గుర్తుచేస్తూ, గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు పాటుపడతానని ఆమె పేర్కొన్నారు. స్థానికులు ఎదుర్కొంటున్న తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్య సమస్యలను అడిగి తెలుసుకున్న ఆమె, తాను గెలిచిన వెంటనే వాటి పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు.తనపై నమ్మకంతో ఒక అవకాశం ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. లక్ష్మిదేవమ్మ పర్యటనతో పిక్కిలివానిపల్లిలో ఎన్నికల సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వైకాపా నాయకులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆమెకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.