పీజీఆర్‌ఎస్ అర్జీలను జాప్యం లేకుండా పరిష్కరించాలి
పీజీఆర్‌ఎస్ అర్జీలను జాప్యం లేకుండా పరిష్కరించాలి
జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ
మదనపల్లె, సెప్టెంబర్ 28:
పీజీఆర్‌ఎస్‌లో ప్రజలు అందించే అర్జీలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా నాణ్యతతో, పారదర్శకంగా, అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్‌తో పాటు డీఆర్వో వెంకటేష్, రాయచోటి ఆర్డీవో శ్రీనివాస్ తదితర అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
పెండింగ్ దరఖాస్తులు, బియాండ్ ఎస్‌ఎల్‌ఏ, రీఓపెనింగ్ లేకుండా అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. పింఛన్లు, రైతుభరోసా, భూ సమస్యలు తదితర అంశాలపై ప్రజలు అర్జీలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 424 అర్జీలు అందగా, వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేసి సత్వర పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. వివిధ శాఖల జిల్లా అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.