BREAKING
ఆంక్షల గుప్పెట్లో హస్తిన.. అడుగడుగునా పోలీసులు పేకాట స్థావరంపై పోలీసులు దాడి. ఇంకొల్లు సభలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ •ఇంకొల్లు, నాగండ్ల, పావులూరులో రూ.25 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు •అభివృద్ధికి తొలి ప్రాధాన్యం... ఎమ్మెల్యే ఏలూరి గ్రామాల సమగ్ర అభివృద్ధికి పల్లె పండగతో శ్రీకారం అభివృద్ధి పనులతో కళకళలాడుతున్న నియోజకవర్గంలోని గ్రామాలు * భీమవరం మండలంలోని వెంప, శ్రీరామపురం, తుందుర్రు, బేతపూడి కరుకువాడ గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు ఊరు ఊరుకో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ ఉత్సవాలు *ఎర్రకాలువ మిగులు భూముల్లో సాగు చేస్తున్న భూములకు రక్షణ కల్పించాలి* *సాగు భూముల్లో పశువులతో పంటను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి* పర్చూరులో రూ.25.29 కోట్లతో అభివృద్ధి పనులు •మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరికి అడుగడుగునా ప్రజల నీరాజనం గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ,జడ్ పీటీసీ, ఎన్నికల నిర్వహణకు మండల యంత్రాంగం సిద్ధంగా ఉండలి నేతాజీ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థుల కు బహుమతుల ప్రధానం చేసిన......... పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు అద్దంకిలో ప్రజాస్వామ్య ఎన్నికల చైతన్య ర్యాలీ.. వర్షాభావంపై అప్రమత్తంగా ఉండాలి! రూ.7.04 కోట్ల రోడ్లను ప్రారంభించిన మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరి .ఉత్తమ పోస్ట్ మాస్టర్‌గా నారపాము దుర్గారావుకు పురస్కారంశుభాకాంక్షలు తెలిపిన మేము సైతం మిత్ర బృందం ఫేక్‌ న్యూస్‌తో అప్రమత్తంగా ఉండాలి

పేదల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి భరోసా-మంత్రి నారాయణ

Select Suryaa Now
పేదల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి భరోసా-మంత్రి నారాయణ

నెల్లూరు సిటీలో 50 మందికి రూ.31.34 లక్షల ఆర్థిక సాయం అందజేసిన మంత్రి నారాయణ

ఇప్పటివరకు 579 మందికి రూ.5.19 కోట్లకు పైగా సాయం

నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ :   ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్‌) ఆర్థిక భరోసాగా నిలుస్తోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందన్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు శుక్రవారం చింతారెడ్డిపాలెంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సీఎంఆర్ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా 50 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.31,34,707 విలువైన చెక్కులను అందజేశారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలకు ఈ సాయం ఊరటనిస్తుందని మంత్రి పేర్కొన్నారు. అర్హులైన వారికి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల చేతికే చెక్కులు అందజేస్తున్నట్లు తెలిపారు.
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇప్పటివరకు 579 మందికి రూ.5,19,34,509 విలువైన సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, సీఎంఆర్ఎఫ్‌ ద్వారా సాయం అందిస్తున్నారని తెలిపారు.
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు అడిగిన వెంటనే ఆర్థిక సాయం మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. వైద్య ఖర్చుల భారం కారణంగా ఏ పేద కుటుంబమూ ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో సీఎం సహాయనిధి ద్వారా బాధితులకు అండగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు.