పేదల ఆరోగ్య భద్రతకే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం: పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల
పెందుర్తి, సూర్య : అనారోగ్యంతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక చేయూతనిచ్చి కొండంత అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరప్రదాయనిలా నిలుస్తోందని జనసేన పార్టీ విశాఖపట్నం ఉమ్మడి రూరల్ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు పునరుద్ఘాటించారు.
సోమవారం సుజాతనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గానికి చెందిన 16 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 7,64,568 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి ఆరోగ్య వివరాలను ఆరా తీసిన ఎమ్మెల్యే, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. వైద్య ఖర్చుల భారాన్ని తట్టుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలకు అండగా నిలవడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో నెలకు రెండుసార్లు ఈ సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని వివరించారు. లబ్ధి పొందిన వారు పరిసర ప్రాంతాల్లోని ఇతర బాధితులకు కూడా ఈ పథకంపై అవగాహన కల్పించి సాయం పొందేలా చూడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కరణం కనకారావు, పెందుర్తి పీఏసీఎస్ చైర్మన్ అయితే సింహాచలం, వార్డు అధ్యక్షులు సేనాపతి సోమశేఖర్, పెన్నింటి పార్వతి, కంచిపాటి మధు, ఒబ్బిన జనార్ధన శ్రీకాంత్, మాజీ సర్పంచులు మామిడి శంకర్రావు, గజ్జి నరసింగరావు, బోండా తాతారావు, ఆకుల గణేష్, కూటమి నాయకులు సుందరపు శ్రీనివాసరావు, గవర సత్తిబాబు, వెలుగుల అనిల్, అయితే శ్రీనివాసరావు, వరాహ నరసింహమూర్తి లతో పాటు ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్ : నారాయణ, పెందుర్తి, విశాఖపట్నం.