పెదభోగిలి జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా నీటిని సరఫరా చేయాలి....
- పారా లీడర్ సెల్ వాలంటరీ. చర్మ కళాకారుల రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సవరపు రామారావు.
సీతానగరం, మండలం పెదభోగిలి గ్రామంలో జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికి నీటి సరఫరా ను ఏర్పాటు చేయాలని పారా లీడర్ సెల్ వాలంటరీ. చర్మ కళాకారుల రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సవరపు రామారావు డిమాండ్ చేశారు ఈ మేరకు సోమవారం నాడు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎంపీడీవో ఎంఎల్ ప్రసాద్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ పెదభోగిలి పంచాయతీలో నాలుగు గ్రామాలకు జల్ జీవన్ మిషన్ పథకంలో సుమారు రెండు కోట్ల రూపాయలు పైగా శాంక్షన్ అయ్యాయని అయితే అప్పయ్యపేట. బుడ్డిపేట (కొంతవరకు). సీతానగరం లో అమలు చేయగా కేవలం పెదభోగిలి గ్రామంలో అత్యధిక దళితులతో పాటు బీసీ ఇతర కులస్తులు ఉన్న ప్రాంతంలో మాత్రం ఎందుకు ఈ పథకాన్ని అమలు చేయలేదని వాటి అమల్లో స్థానిక అధికారులు కొంతమంది నాయకుల నిర్లక్ష్యం కారణంగా నష్టపోయామని ఇప్పటికైనా జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికి కొళాయిలు ద్వారా నీటి సరఫరా చేయాలని అలాగే ఈ పంచాయతీకి జల్ జీవన్ మిషన్ పథకానికి విడుదలైన నిధులను ఏ రకంగా ఖర్చు పెట్టారు దేని దేనికి ఎంత ఖర్చు చేశారని అనే వివరాలు తక్షణ తెలుపగలరని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు పాల్గొనడం జరిగింది.