BREAKING
టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన

పవిత్రమైన పాపాగ్ని నదిని కాపాడండి

Select Suryaa Now
పవిత్రమైన పాపాగ్ని నదిని కాపాడండి

*పవిత్రమైన పాపాఘ్న నదిని కాపాడండి*


- *పులివెందుల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ధ్రువ కుమార్ రెడ్డి*


పులివెందుల మేజర్ న్యూస్:

పులివెందుల నియోజకవర్గం లోని  వేంపల్లి మండలంలో పాపాఘ్న నది తీర ప్రాంతాలు ఆక్రమునకు గురవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జ్ మూలం రెడ్డి ధ్రువ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో బుధవారం పులివెందులలో rdo చిన్నయ్య ని కలిసి ఆక్రమణకు గురైన పాపాఘ్న నదిని కాపాడాలని వినతిపత్రం అందించారు. పాపాగ్ని నదీ తీర ప్రాంతంలో కొందరు వ్యక్తులు అక్రమంగా పంటలు సాగు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. వేంపల్లి నుండి గాలివీడు   వరకు ,  వేంపల్లి నుండి కమలాపురం వరకు పంటలు సాగు చేస్తున్నారని దీంతో పాపాఘ్న నది కుంటలా కనిపిస్తోందని ఆయన చెప్పారు. గతంలో కూడా ఈ నది ఆక్రమణకు గురైందని అప్పట్లో వరదల కారణంగా నదీ తీర ప్రాంతాలు కొట్టుకుపోయాయని అయినా కూడా తిరిగి కొందరు అక్రమార్కులు పాపాఘ్న నదిలో ఫైర్లు సాగు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పంటలకు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడడం వల్ల స్వచ్ఛమైన పాపాఘ్న నది కలుషితం అవుతుందని ,అలాగే బోర్లు నదిలో ఎక్కడ అంటే అక్కడ వేయడం వల్ల భూగర్భ జలం తగ్గే ప్రమాధం ఉంధి, మోటర్ల కోసం కరెంట్ తీగలు ఎర్రు అంతా లాగారు ఆ కరెంట్ తీగలు తగీలి జంతువులు,మనుషులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంధి అని చెప్పారు. పాపాఘ్న నది ఎంతో పవిత్రమైనదని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఆయన చెప్పారు. సంబంధిత అధికారులు వెంటనే సర్వే నిర్వహించి చర్యలు తీసుకుని పాపాఘ్న నదిని కాపాడాలన్నారు. లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందిస్తానని చెప్పారు. అయినప్పటికీ కూడా చర్యలు లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పులివెందుల టౌన్ అధ్యక్షులు బోనాల ఖాదర్ వల్లి,  వేంపల్లి మండల అధ్యక్షులు రామకృష్ణ  ,జిల్లా ప్రధాన కార్యదర్శి వేమయ్య, కిస్సాన్ సెల్ జిల్లా ఉపాద్యక్షులు తోపిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి,కిస్సాన్ సెల్ నియోజకవర్గ అద్యక్షులు బద్రినాథ్, వేముల మండలద్యక్షులు వెంకటేష్,టౌన్ మహిళా నాయకులు అనూష,బాబు, బషీర్ మండల నాయకులు నరేంద్ర, ఆంజనేయులు నాయక్ ,శ్యామ్ , ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు