BREAKING
ఉత్కలాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గ ఆలయంలో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో హుండీ ప్రారంభం విపత్తు నిర్వహణలో విద్యార్థుల భాగస్వామ్యం అత్యంత కీలకం పశుగ్రాస సాగుకు దరఖాస్తుల ఆహ్వానం కొత్తమ్మతల్లి సేవలో ఖాకీలు రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికైన ఎస్.రాయవరం విద్యార్థినులు! పెనుగొండ వాసవి అమ్మవారి శరన్నవరాత్రులకు ఘన ఏర్పాట్లు ★పది రోజుల పాటు వివిధ అలంకారాల్లో దర్శనం మానసిక ఆరోగ్యంపై అపోహలు వీడాలి! ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రజా సమస్యల వినతులు స్వీకరణ... బీసీలకు ద్రోహం చేసింది వైసీపీనే! చెన్నైలో సీఎం విజయ్‌తో రాహుల్ గాంధీ భేటీ ఢిల్లీలో సీఈసీపై నిరసనల వేళ.. నీలంకరైలోని నివాసంలో గంటపాటు ఏకాంత చర్చలు. జిల్లా జడ్పీ సీఈఓ గా టి.ఎన్.శోభన్ బాబు 25వ రోజుకు చేరిన వి ఆర్ ఏ ల రిలే నిరాహార దీక్ష పాకలపాడు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం – ప్రజలకు అవగాహన కల్పించిన సీఐ రేవతమ్మ

పరిశుభ్రమైన వీధులే ఆరోగ్యానికి పునాది

Select Suryaa Now
పరిశుభ్రమైన వీధులే ఆరోగ్యానికి పునాది

గరుగుబిల్లి, సూర్య : పరిశుభ్రమైన వాతావరణం, పరిశుభ్ర మైన వీధులే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అని మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరియు పెద్దూరు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి నడిమింటి సూర్యనారాయణ పేర్కొన్నారు.మండల పరిధిలోని పెద్దూరు గ్రామంలో శుక్రవారం 'మన వీధి - మన బాధ్యత' కార్యక్రమంలో భాగంగా వీధులను శుభ్రం చేయడంతో పాటు పరిసరాలను పరిశుభ్రం చేశారు. అదే విధంగా పక్కా కాలువల్లో దోమల నివారణకు ఆయిల్ బాల్స్ ను వేశారు. ఈసందర్భంగా మండల పరిషత్ అభి వృద్ధి అధికారి నడిమింటి సూర్యనారా యణ మాట్లాడుతూ గ్రామ పంచాయ తీల పరిధిలో వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పూర్తిస్థాయిలో పారిశు ధ్యం మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. తడి,పొడి చెత్తను వేరు,వేరుగా గ్రీన్ అంబాసిడర్లకు అందించాలని కోరారు. ఇళ్లు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు డ్రెయిన్లలో చెత్తను వేయకూడదని సూచించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించినప్పుడే వ్యాధుల నివారణ సాధ్యమవుతుంద న్నారు.ఈకార్యక్రమంలో గ్రామ పంచా యతీ కార్యదర్శి బంటు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : శశి భూషణరావు, గరుగుబిల్లి, పార్వతిపురం మన్యం.