BREAKING
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠకు తెర: రేపు హైకోర్టు కీలక తీర్పు పట్టాలతో పేదలకు పట్టాభిషేకం అక్టోబర్ 6న చలో ఉస్మానియా ను విజయవంతం చేయండి మాంచెస్టర్ సిటీ యాజమాన్యం తప్పుకుంటే తీవ్ర ఆందోళన చెందుతాం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న విమానంలో తీవ్ర ఉద్రిక్తత ఏపీలో సర్వే/రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు: లబ్ధిదారులు, ప్రజలకు ఊరటనిస్తూ ప్రభుత్వ నిర్ణయం పౌర హక్కులపై అవగాహనే లక్ష్యం అమెరికా సెనేట్‌లో డేటా సెంటర్ల విద్యుత్ బిల్లుల బిల్లుకు అడ్డుకట్ట కాంగ్రెస్ ఎన్నికల వాదనలపై రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ ఎద్దేవా : ‘ప్రజల నమ్మకమే బీజేపీ అసలైన బలం’ కరీంనగర్ IDOC ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పీసీసీ అధ్యక్షుడినీ కలిసిన SWU నాయకులు .... హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి వ్యతిరేకంగా అమెరికా ఫెడరల్ దావా జీపీ సిబ్బంది బాగుంటేనే ఊరు బాగుంటుంది … వెలిచాల సర్పంచ్ వీర్ల నర్సింగారావు సమాజానికి అవసరమైన వార్త కథనాలను ప్రచురించాలి .. మీడియా అకాడమీ చైర్మన్ కి శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

పరీక్షలో జవాబు రాయలేదని విద్యార్థిపై టీచర్‌ దాడి!

Select Suryaa Now
పరీక్షలో జవాబు రాయలేదని విద్యార్థిపై టీచర్‌ దాడి!

తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసుల విచారణ.

ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:

పరీక్షలో ప్రశ్నకు సమాధానం రాయలేదన్న కారణంతో ఆరవ తరగతి విద్యార్థిపై ప్రైవేట్‌ టీచర్‌ చేయి చేసుకున్నట్లు ఆరోపణలు రావడం ప్రొద్దుటూరులో చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని సంగమేశ్వర ప్రైవేట్‌ హైస్కూల్‌లో ఆరవ తరగతి చదువుతున్న తమన్‌ అనే విద్యార్థిపై టీచర్‌ దాడి చేసినట్లు అతని తల్లిదండ్రులు ఆరోపించారు. తల్లిదండ్రుల వివరాల మేరకు.. పాఠశాలలో పరీక్ష జరుగుతున్న సమయంలో ప్రశ్నకు సమాధానం రాయలేదన్న కారణంతో తమ కుమారుడిపై టీచర్‌ ఆగ్రహం వ్యక్తం చేసి కొట్టినట్లు తెలిపారు. పరీక్ష అనంతరం విద్యార్థి ఇంటికి చేరుకున్న సమయంలో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసినట్లు చెప్పారు. దీంతో వారు పాఠశాలకు వెళ్లి సంబంధిత టీచర్‌తో పాటు యాజమాన్యాన్ని కలిసి ఘటనపై వివరణ కోరినట్లు తెలిపారు. అయితే తమ ఫిర్యాదుపై పాఠశాల యాజమాన్యం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థిపై శారీరకంగా చేయి చేసుకోవడం సరికాదని, ఘటనపై బాధ్యత వహించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థి తల్లిదండ్రులు ప్రొద్దుటూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. విద్యార్థి, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం, సంబంధిత టీచర్‌ నుంచి వివరాలు సేకరించి వాస్తవాలను నిర్ధారించిన అనంతరం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

విద్యార్థుల భద్రతపై దృష్టి సారించాలి

పాఠశాలల్లో విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పే క్రమంలో శారీరక శిక్షలకు తావు లేకుండా చూడాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. విద్యార్థులపై ఉపాధ్యాయులు చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన సందర్భాల్లో సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, రక్షణ, ఉపాధ్యాయుల ప్రవర్తనపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వాస్తవాలు పోలీసుల విచారణ అనంతరం వెలుగులోకి రావాల్సి ఉంది.