BREAKING
అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పేడాడ ధరణి చంద్రగిరి మండలం లో జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన విద్యార్థిని చదువుకు మానవత ఆర్థిక సహాయం తీదేడు రామాలయం వద్ద ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు బీసీ లు రాజకీయంగా ఎదగకూడదనే వైసీపీ కుట్ర -- 34 శాతం రిజర్వేషన్లు అడ్డుకునేందుకు పన్నాగాలు -- జిల్లా టిడిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి ఆగ్రహం నేడు అమరజీవి జలధార పధకానికి ఎంఎల్ఏ శంకుస్థాపన మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు చంద్రగిరి మండలం జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన పోలవరం కాలువలో దూకిన యువకుడి మృతదేహం లభ్యం ఆకునూరు గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా ఆకుల రాజు నియామకం జడ్పీ సీఈవో గా మధుసూదన్ శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో నేటి నుండి శరన్నవరాత్రి మహోత్సవాలు పెదవేగిలో ఘనంగా 70వ ఏపీ స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం ముఖ్య అతిథిగా పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఆదిమళ్ళ కోటేశ్వరరావు కి నివాళులు అర్పించిన తన్నీరు గోల్ఫ్ క్రీడకు హైదరాబాద్ లో పెరుగుతున్న ఆదరణ

పలువురిని పరామర్శించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అండగా ఉంటామని భరోసా

Select Suryaa Now
పలువురిని పరామర్శించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అండగా ఉంటామని భరోసా

వేంపల్లె మేజర్ న్యూస్:
మండలంలోని పలు గ్రామాల్లో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పర్యటించి పలువురిని పరామర్శించారు. సెప్టెంబర్ 25వ తేదీన మండలంలోని నాగూరు గ్రామంలో ఉన్న వైఎస్ఆర్సిపి నాయకుడు నాగేళ్ల రామచంద్రారెడ్డి కుమారుడు రాంప్రసాద్ రెడ్డి(21) చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో యాక్సిడెంట్ అయి మృతి చెందాడు. శనివారం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మృతుని స్వగృహమైన నాగూరు గ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రాంప్రసాద్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే ఎగువ తువ్వపల్లి గ్రామంలో ఉండే మాజీ ఎంపీటీసీ వెంకటనారాయణ రెడ్డి అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొంది ఇంటికి రావడంతో తన స్వగృహానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వచ్చి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. వైఎస్ఆర్సిపి ఎప్పుడు తమకు అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం నాయకులు కార్యకర్తలను కలిసి స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. అలాగే ఇటీవల గ్రామ కమిటీ సభ్యులకు ఇచ్చిన గుర్తింపు కార్డులను ఆయన అందజేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామస్థాయి కమిటీ నుంచి కష్టపడి పనిచేయాలని సూచించారు. వచ్చేది మన ప్రభుత్వమేనని అందరూ అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని భరోసా నింపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి ఎం.రవి కుమార్ రెడ్డి, మండల కన్వీనర్ కె.చంద్రఓబుల్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

గండికోట షేక్ ఖదీర్, వేంపల్లె.
వైఎస్ఆర్ కడప జిల్లా.