పల్లిసారధిలో కూటమి సర్పంచ్ అభ్యర్థి విశ్వనాథం హవా.
పంచాయితీ ని మాటలతో కాదు,చేతలతో అభివృద్ధి చేసి చూపిస్తా.
పలాస/వజ్రపుకొత్తూరు, నవంబర్ 17,మేజర్ న్యూస్.
వజ్రపుకొత్తూరు మండలం పల్లిసారధి పంచాయతీలో కూటమి సర్పంచ్ అభ్యర్థి తామడ విశ్వనాథం ప్రచారం హాట్ టాపిక్ అయ్యింది.పదవి కోసం కాదు, ప్రజాసేవ కోసమే బరిలో ఉన్నానని ఆయన చెబుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటింటి ప్రచారంలో తిరుగుతూ పెద్దల ఆశీర్వాదం తీసుకుంటున్నారు.
1983లో శ్రీ యువజన నట సమాఖ్య సంఘం ఏర్పాటుతో ఆయన ప్రజా జీవితం మొదలైంది.నాలుగు దశాబ్దాలుగా గ్రామంలో సాంస్కృతిక, సేవా, క్రీడా కార్యక్రమాల్లో ముందుంటున్నారు.మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను ప్రజల కష్టాలు అర్థం చేసుకున్న వ్యక్తినని చెబుతున్నారు.
ప్రధాన హామీలు..
ప్రతి వీధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం, వీధి దీపాలు, అర్హులందరికీ సంక్షేమ పథకాలు."అర్హత ఉంటే చాలు, సిఫార్సు అవసరం లేదు"అని అంటున్నారు."ఓట్లను బెదిరించడం కాదు, ప్రజల మనసు గెలవడమే నిజమైన గెలుపు"అని పేర్కొన్నారు. పల్లిసారధిని జిల్లాలోనే ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.