BREAKING
పిల్లల్లో విపరీతంగా పెరుగుతున్న చదువు ఒత్తిడి.. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి నేదునూరులో పెళ్లి బృందం వ్యాన్ బోల్తా30 మందికి గాయాలు.. పెదపుల్లేరు జనసేన ఎంపీటీసీ అభ్యర్థిగా పాటూరి మోహన్ ఉప్పలగుప్తం జనసేన జడ్పీటీసీ అభ్యర్థిగా ఆకుల లక్ష్మీ నరసాయమ్మ నామినేషన్.. వైసీపీ నుండి జనసేన లోనికి భారీగా చేరికలు వట్లూరు ఎంపిటిసి అభ్యర్థిగా అంబేద్కర్ నామినేషన్ అంబాజీపేట మండలంలో రెండో రోజు 46 నామినేషన్లు దాఖలు రెండో రోజు 36 నామినేషన్లు దాఖలు రాకేష్ వర్మ ‘మాయ లేడీ’ సినిమా విడుదల తేదీ ఖరారు.. నవంబర్ 13న థియేటర్లలో సందడి పాడి రైతులకు తక్కువ ధరకు పశుదాణా.. నెలకు 300 టన్నుల సరఫరాకు కలెక్టర్ కసరత్తు. ఎంపీటీసీ వైయస్సార్సీపి అభ్యర్థిగా పోటీ చేయనున్న ధూళిపూడి కృష్ణవేణి 30వ వార్డులో అభ్యర్థి పద్మజకు మద్దతుగా నల్లా శ్రీధర్ ప్రచారం. అభాగ్యురాలైన నిండు గర్భిణీకి ఆసరాగా నిలిచిన ఏలూరు జిల్లా 'శక్తి' టీమ్ ఆసియా పారా క్రీడల్లో భారత అథ్లెట్ల అపూర్వ విజయం.. ఒకే రోజు ఏకంగా 27 పతకాల పంట కొమరం భీమ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి..

పల్లెపోరు షురూ..! *గ్రామాల్లో వేడెక్కుతున్న వాతావరణం *

Select Suryaa Now
పల్లెపోరు షురూ..! *గ్రామాల్లో వేడెక్కుతున్న వాతావరణం *

విజయనగరం బ్యూరో, సూర్య : జిల్లాలో ఓ వైపు మున్సిపోల్స్ హడావుడి కొనసాగుతుండగానే, పరిషత్ పోరుకు నోటిఫికేషన్ జారీ అవడంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ల ప్రక్రియ మొదలవడంతో పల్లెపోరు రసవత్తరంగా మారుతోంది. జిల్లాలో 27 జెడ్పీటీసీ, 449 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. జెడ్పీ చైర్మన్ పదవిని బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. జెడ్పీటీసీ,  ఎంపీపీ పదవులను చెరో 13 వంతున కేటాయించారు. 449 ఎంపీటీసీల్లో 217 మహిళలకు కేటాయించారు. జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో బీసీలకు 9 చొప్పున, 5 బీసీ జనరల్, మిగిలిన 4 బీసీ జనరల్ కు రిజర్వ్ చేశారు. ఆన్ రిజర్వుడ్ స్థానాల్లోను బీసీలు పోటీచేసే అవకాశం ఉంది. 7 జనరల్, మరో 7 జనరల్ మహిళలకు కేటాయించారు.


ఈ నేపథ్యంలో జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ షురూ అయింది. ఖరారైన అభ్యర్థులు నామినేషన్లు దాఖలుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రానిచోట బుజ్జగింపుల పర్వం నడుస్తోంది. పొత్తు కష్టాలు ఇక్కడ కూడా ఇబ్బంది పెడుతున్నాయి. మూడుపార్టీల మధ్య టికెట్ల పంచాయతీ రంజుగా నడుస్తోంది. మున్సిపోల్స్ అసమ్మతి అసంతృప్తులు ఇక్కడ కూడా కొనసాగుతున్నాయి. రెబెల్ గా రంగంలోకి దిగేందుకు కొందరు సిద్ధపడుతున్నారు. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సిగపట్లు చర్చనీయాంశంగా మారాయి. జనసేనకు మొక్కుబడిగా కొన్ని టికెట్లు ఇచ్చి సరిపెట్టాలని టీడీపీ భావిస్తుండగా, గ్లాసుపార్టీ ససేమిరా అంటోంది. అన్నిచోట్లా రెబల్ గా దిగేందుకు సిద్ధమవుతోంది. వైసీపీలో కూడా అసంతృప్తులు మొదలయ్యాయి. పార్టీకోసం పనిచేసినవారిని కాకుండా కాకారాయుళ్లకు టికెట్లు ఖరారు చేయడాన్ని సీనియర్లు జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే, టీడీపీ, జనసేనతో పోల్చిచూస్తే ఈ పార్టీలో అంతగా గొడవలు, అలకలు కనిపించడంలేదు. కాకపోతే, కొన్నిచోట్ల అభ్యర్థుల కొరత ఆ పార్టీకి ఇబ్బంది కలిగిస్తోంది. చిన్నశ్రీను ఎపిసోడ్ నేపథ్యంలో పలుచోట్ల వైసీపీ కేడర్ ఆయన్ను అనుసరించింది. బలమైన వ్యక్తులు ఆయన వెంట వెళ్లడంతో మిగిలిన వారిలో ఎవరో ఒకరికి బొట్టు పెట్టడం మినహా నేతలకు మరో ఆప్షన్ లేకుండా పోతోంది. జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక అన్నిపార్టీల్లోనూ తలనొప్పిగా మారింది. రిజర్వేషన్లు కుదరనిచోట యాగీ జరుగుతోంది. వారిని సముదాయించేందుకు నేతలకు తలప్రాణం తోకకు వచ్చినంత పనవుతోంది.
జెడ్పీ చైర్మన్ అభ్యర్థి ఎంపిక అన్నిపార్టీల్లోనూ ఆసక్తికరంగా మారింది. నాయకుల వారసులు తెరపైకి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీసీ మహిళకు కేటాయించడంతో నాయకులు సతీమణులు, పుత్రికా రత్నాలు పేర్లు హల్చల్ చేస్తున్నాయి. విశేషమేమంటే, కొన్నిచోట్ల ప్రధాన పార్టీలు అభ్యర్థుల కొరతతో సతమతమవుతున్నాయి ప్రస్తుతానికి, కాస్త మందకొడిగా వాతావరణం కనిపించినా, నామినేషన్లు మొదలయ్యాక వాతావరణం వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే, పల్లెపోరు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

రిపోర్టర్ :  డేవిడ్ రాజు, విజయనగరం.