BREAKING
ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఇంటికీ ఒక జూట్ సంచి పంపిణీ చేయాలి.. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.. పుష్కరాల నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలి : దేవస్థాన అభివృద్ధి పనులపై దేవాదాయశాఖ కమిషనర్ సమీక్ష కాంట్రాక్ట్ నర్సుల నిరసన దీక్ష.... వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీకాంత్ సంఘీభావం.. స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవ్వండి జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే గిడ్డి రావులపాలెం, వాడపల్లి ఏటిగట్టు రహదారి విస్తరణ, నిర్మాణానికి రూ.19 కోట్లు కేటాయించాలని కోరిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సత్యానందరావు రావులపాలెం - పలివెల రహదారి అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడి! అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మోడీ ప్రజాస్వామ్యానికే ప్రమాదకారి: సిఐటియు నాయకుడు ఎస్. భగత్ ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీసుల ముందస్తు చర్యలు :సీఐ వెంకటేశ్వరరావు పుష్కరాల నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన వేమగిరిలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం :రీ సర్వే చేసి భారీ మురుగు కాలువ నిర్మిస్తాం: ఎమ్మెల్యే గోరంట్ల ఠానేలంక గురుకులంలో న్యాయ విజ్ఞాన సదస్సు...విద్యార్థినులతో మేజిస్ట్రేట్ ముఖాముఖి... నేటి రాశి ఫలాలు: 11 అక్టోబర్ 2026. నేటి పంచాంగం 11 అక్టోబర్ 2026

పచ్చని పల్లెలకు డేటా సెంటర్ల ముప్పు!

Select Suryaa Now
పచ్చని పల్లెలకు డేటా సెంటర్ల ముప్పు!

భోగాపురం, సూర్య: పచ్చని పంట పొలాలతో కళకళలాడే భోగాపురం ప్రాంతంలో డేటా సెంటర్ల ఏర్పాటుతో పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు టి.వి. రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామనే హామీల సంగతేమో గానీ, డేటా సెంటర్ల వల్ల కలిగే పర్యావరణ నష్టం, భవిష్యత్తులో తలెత్తే నీటి సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అనుమతుల నోటిఫికేషన్ జారీ చేయడం తగదని, వెంటనే ఆ ప్రక్రియను విరమించుకోవాలని ఆయన హెచ్చరించారు. తమ ప్రాంతంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయవద్దంటూ రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. డేటా సెంటర్ల నిర్వహణకు అధికంగా నీరు అవసరమయ్యే పరిస్థితుల్లో భవిష్యత్తులో ఈ ప్రాంతం తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రమాదం ఉందని రమణ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పచ్చని పంట పొలాలతో విరాజిల్లుతున్న ఈ ప్రాంతంలో ఇటువంటి ప్రాజెక్టుల వల్ల వ్యవసాయానికి విఘాతం కలగడంతో పాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతుల అభ్యంతరాలను, స్థానిక ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ సభ్యులు బి. సూర్యనారాయణ, ఎన్.వి. రమణ తదితరులు పాల్గొన్నారు.