పాఠశాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం నూతనంగా ఎంపికైన చైర్మన్లు
జలదంకి, తిమ్మసముద్రం లలలో ఎస్ఎంసి ఎన్నికలు ఏకగ్రీవం
జలదంకి,మేజర్ న్యూస్ :- జలదంకి మండలంలోని పాఠశాల నిర్వహణ కమిటీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు గురువారం జలదంకి ఉన్నత పాఠశాల, తిమ్మసముద్రం ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఈ ఎన్నికలు రెండు పాఠశాలల్లో ఏకగ్రీవంగా జరిగాయి. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఎస్ఎంసి చైర్మన్లు, వైస్ చైర్మన్లు తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. జలదంకి ఉన్నత పాఠశాలలో ఇన్చార్జ్ హెచ్ఎం మాధురి ఆధ్వర్యంలో జరిగిన ఎస్ఎంసి ఎన్నికల్లో చైర్మన్గా మారుబోయిన సుందరయ్య యాదవ్, వైస్ చైర్మన్ గా ఎగురిజయలక్ష్మిలను విద్యార్థుల తల్లిదండ్రులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్ వైస్ చైర్మన్ లతోపాటు 15 మంది సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే తిమ్మసముద్రం ప్రాథమికోన్నత పాఠశాలలో హెచ్ఎం సీతాలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఎస్ఎంసి ఎన్నికల్లో చైర్మన్గా ఇండ్ల మాధవి, వైస్ చైర్మన్గా మబ్బు మాధురి లతోపాటు 12 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తిమ్మసముద్రం గ్రామంలో నూతనంగా ఎన్నికైన చైర్మన్,వైస్ చైర్మన్ లను తెలుగుదేశం పార్టీ నాయకులు కంచర్ల వినోద్, గ్రామ టిడిపి నాయకులు శాలువాలతో సత్కరించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా కంచర్ల వినోద్ నాయుడు మాట్లాడుతూ నూతనంగా పాఠశాల చైర్మన్గా, వైస్ చైర్మన్ గా ఎన్నికైన సభ్యులు పాఠశాల అభివృద్ధి కోసం పిల్లల చదువుల పురోగతి కోసం కృషి చేయాలని అన్నారు. అంతేకాక పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన విద్యార్థుల హాజరు తదితరాలపై దృష్టి సారించి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. జలదంకి ఉన్నత పాఠశాలలో నూతనంగా ఎంపికైన చైర్మన్ మారు బోయిన సుందరయ్య, ఏ గూ రి జయలక్ష్మి లను జలదంకి ఎస్సై వీరేంద్రబాబు, సోమశిల వైస్ చైర్మన్ మధు మోహన్ రెడ్డి, టిడిపి నాయకులు కూరపాటి మాలకొండ రెడ్డి, గంట అశోక్, బిజెపి నాయకులు ము డీ కిషోర్ రెడ్డి, వడ్డే శ్రీనాథ్ రెడ్డి, జనసేన నాయకులు నిమ్మలపల్లి రామచైతన్య, తోట మురళి,సింగమనేని అరవింద్ యాదవ్ లు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా జలదంకి ఎస్ఎంసి చైర్మన్గా ఎన్నికైన సుందరయ్య మాట్లాడుతూ మన పాఠశాలను మరింత మెరుగుపరచడానికి ప్రణాళికలను తయారుచేసుకుని ముందుకు పోదామని అన్నారు. మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. పాఠశాల చైర్మన్గా తనను ఏకగ్రీవంగా ఎన్నికయ్యాలా చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు, కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన జలదంకి ఎస్సై వీరేంద్రబాబు, ఏఎస్ఐ హరిబాబులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిమ్మసముద్రం తెలుగుదేశం పార్టీ నాయకులు మేకల శ్రీనివాసులు, దివి లోకేష్, అమావాస్య మహేశ్వరరావు, కంచర్ల వేణుగోపాల్, పట్నం మాల్యాద్రి, జి రమేష్, పి మాల్యాద్రి, చిన్న, నవీన్, కలగయ్య, తదితరులు పాల్గొన్నారు.