BREAKING
ఆంక్షల గుప్పెట్లో హస్తిన.. అడుగడుగునా పోలీసులు పేకాట స్థావరంపై పోలీసులు దాడి. ఇంకొల్లు సభలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ •ఇంకొల్లు, నాగండ్ల, పావులూరులో రూ.25 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు •అభివృద్ధికి తొలి ప్రాధాన్యం... ఎమ్మెల్యే ఏలూరి గ్రామాల సమగ్ర అభివృద్ధికి పల్లె పండగతో శ్రీకారం అభివృద్ధి పనులతో కళకళలాడుతున్న నియోజకవర్గంలోని గ్రామాలు * భీమవరం మండలంలోని వెంప, శ్రీరామపురం, తుందుర్రు, బేతపూడి కరుకువాడ గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు ఊరు ఊరుకో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ ఉత్సవాలు *ఎర్రకాలువ మిగులు భూముల్లో సాగు చేస్తున్న భూములకు రక్షణ కల్పించాలి* *సాగు భూముల్లో పశువులతో పంటను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి* పర్చూరులో రూ.25.29 కోట్లతో అభివృద్ధి పనులు •మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరికి అడుగడుగునా ప్రజల నీరాజనం గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ,జడ్ పీటీసీ, ఎన్నికల నిర్వహణకు మండల యంత్రాంగం సిద్ధంగా ఉండలి నేతాజీ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థుల కు బహుమతుల ప్రధానం చేసిన......... పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు అద్దంకిలో ప్రజాస్వామ్య ఎన్నికల చైతన్య ర్యాలీ.. వర్షాభావంపై అప్రమత్తంగా ఉండాలి! రూ.7.04 కోట్ల రోడ్లను ప్రారంభించిన మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరి .ఉత్తమ పోస్ట్ మాస్టర్‌గా నారపాము దుర్గారావుకు పురస్కారంశుభాకాంక్షలు తెలిపిన మేము సైతం మిత్ర బృందం ఫేక్‌ న్యూస్‌తో అప్రమత్తంగా ఉండాలి

పార్వతీపురం మన్యం సర్కిల్‌లో ఏపీఈపీడీసీఎల్ అధికారుల సమీక్షా సమావేశం

Select Suryaa Now
పార్వతీపురం మన్యం సర్కిల్‌లో ఏపీఈపీడీసీఎల్ అధికారుల సమీక్షా సమావేశం

​పార్వతీపురం, సూర్య : ఏపీఈపీడీసీఎల్ పార్వతీపురం మన్యం సర్కిల్ పరిధిలోని ఫీల్డ్ ఇంజనీర్లతో ఎస్‌ఈ  అధ్యక్షతన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్‌ను అందించడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ భద్రతా ప్రమాణాలను నిరంతరం తనిఖీ చేయాలని, సరఫరాలో అంతరాయాలను పర్యవేక్షిస్తూ వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గృహ వినియోగదారులకు, వ్యవసాయదారులకు నిర్ణీత వ్యవధిలోనే నూతన విద్యుత్ కనెక్షన్లు విడుదల చేయాలని స్పష్టం చేశారు. ​అలాగే విద్యుత్ ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదాలు సంభవించిన సందర్భాల్లో త్వరితగతిన పరిహారం అందేలా చూడాలన్నారు. స్మార్ట్ మీటర్ల ద్వారా పారదర్శకమైన బిల్లింగ్ విధానాన్ని అమలు చేస్తూ, డిజిటల్ చెల్లింపులపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. 'పీఎం సూర్యఘర్' పథకాన్ని విస్తృతంగా అమలు చేయడంతో పాటు, 'పీఎం జనమన్', 'పీఎం దాజ్ గువా' పథకాల కింద గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ లేని నివాసాలు, గృహాలు, ఎంపీసీల సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల క్రమబద్ధమైన నిర్వహణ చేపడుతూ కేపీఐ లక్ష్యాలను సాధించాలన్నారు. వినియోగదారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ సంస్థపై ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని  పెంపొందించేలా ప్రతీ అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో సర్కిల్ పరిధిలోని ఫీల్డ్ ఇంజనీర్లు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : ఎస్ఎస్ నాయుడు, పార్వతిపురం మన్యం.