పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు కలెక్టర్ దసరా శుభాకాంక్షలు
పార్వతీపురం,సూర్య: విజయదశమి (దసరా) పండుగ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక విజయదశమి, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దసరా పండుగ జిల్లా ప్రజలందరికీ శక్తి, సంతోషం, సమృద్ధిని ప్రసాదించాలని ఆకాంక్షించారు. కనకదుర్గ అమ్మవారి దివ్య అనుగ్రహంతో జిల్లా ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మరియు జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన ఒక సందేశంలో తెలిపారు