పారిశుధ్య పనులను తనిఖీ చేసిన డిప్యూటీ ఎంపీడీవో
నరసన్నపేట, సూర్య : నరసన్నపేట గ్రామపంచాయతీ పరిధిలో కొనసాగుతున్న పారిశుధ్య పనులను డిప్యూటీ ఎంపీడీవో కమ్ గ్రామపంచాయతీ కార్యనిర్వహణాధికారి పిల్లా జగన్ మోహనరావు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారులు, వీధుల్లో మురుగునీటి కాలువల శుభ్రత, చెత్త తొలగింపు, బహిరంగ ప్రదేశాల పరిశుభ్రత పనులను తనిఖీ చేశారు. పారిశుధ్య కార్మికులు, సూపర్‌వైజర్లకు పలు సూచనలు చేశారు. కాలువలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని, చెత్తను ఎప్పటికప్పుడు సేకరించి సక్రమంగా తొలగించాలని ఆదేశించారు.