BREAKING
మొదటి నెల జీతంతో వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్దేశించిన లక్ష్యాల మేరకు రీ సర్వే పనుల పురోగతిని వేగవంతం చేయాలి* విద్యతో పాటు సేవలోనూ ఆదర్శం. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు సంధ్యారాణికి ఘన సన్మానం. శానిటేషన్‌ వర్కర్లకు వైద్య పరీక్షలు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి విచారణ జరిపి గిరిజనులకు న్యాయం చేయాలి: జీవీఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయ నాయక్ పంబలేరు వంతెన రహదారి పనుల పరిశీలన పశుపోషణతో రైతులకు లాభదాయకం అక్టోబర్ 2వ తేదీ ఉదయం 9:33 గంటలకు పొట్టేపాలెం కలుజు ప్రారంభోత్సవం మైన్లలో అధికారుల తనిఖీలు వివరాలు గోప్యం అరసవల్లి అభివృద్ధికి నిధుల విడుదలపై ఎమ్మెల్యే గొండు శంకర్ హర్షం.. జై భీమ్ నగర్ గిరిజన కాలనీలో వైద్య విబిరం కనువిందు చేసిన 150 జతల ఒంగోలు గిత్తలు! జీవో నెంబర్ 6 ను తక్షణమే అమలు చేయాలి వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి సినిమాలోని క్వీర్ అంశాలపై వస్తున్న ట్రోల్స్, నెగెటివిటీపై స్పందించిన నటుడు రిషికాంత్

పారడైజ్‌ సక్సెస్‌ మీట్‌కు గన్నవరం చేరుకున్న హీరో నాని.

Select Suryaa Now
పారడైజ్‌ సక్సెస్‌ మీట్‌కు గన్నవరం చేరుకున్న హీరో నాని.

గన్నవరం, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్.

‘పారడైజ్‌’ సినిమా సక్సెస్‌ మీట్‌లో పాల్గొనేందుకు ప్రముఖ సినీ హీరో నాని బుధవారం హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. నాని రాకతో అభిమానులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకుని ఘన స్వాగతం పలికారు. అనంతరం నాని రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు. విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం గుంటూరులోని మైత్రి మాల్‌లో నిర్వహించనున్న ‘పారడైజ్‌’ సినిమా సక్సెస్‌ మీట్‌లో పాల్గొననున్నారు.తదుపరి ఒంగోలులోని కృష్ణ థియేటర్‌లో నిర్వహించనున్న సక్సెస్‌ మీట్‌లోనూ హీరో నాని పాల్గొంటారని చిత్ర బృందం వెల్లడించింది. నాని గన్నవరం చేరుకున్న విషయం తెలియడంతో అభిమానులు ఆయనను చూసేందుకు ఉత్సాహంగా తరలివచ్చారు.