BREAKING
ఉత్కలాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గ ఆలయంలో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో హుండీ ప్రారంభం విపత్తు నిర్వహణలో విద్యార్థుల భాగస్వామ్యం అత్యంత కీలకం పశుగ్రాస సాగుకు దరఖాస్తుల ఆహ్వానం కొత్తమ్మతల్లి సేవలో ఖాకీలు రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికైన ఎస్.రాయవరం విద్యార్థినులు! పెనుగొండ వాసవి అమ్మవారి శరన్నవరాత్రులకు ఘన ఏర్పాట్లు ★పది రోజుల పాటు వివిధ అలంకారాల్లో దర్శనం మానసిక ఆరోగ్యంపై అపోహలు వీడాలి! ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రజా సమస్యల వినతులు స్వీకరణ... బీసీలకు ద్రోహం చేసింది వైసీపీనే! చెన్నైలో సీఎం విజయ్‌తో రాహుల్ గాంధీ భేటీ ఢిల్లీలో సీఈసీపై నిరసనల వేళ.. నీలంకరైలోని నివాసంలో గంటపాటు ఏకాంత చర్చలు. జిల్లా జడ్పీ సీఈఓ గా టి.ఎన్.శోభన్ బాబు 25వ రోజుకు చేరిన వి ఆర్ ఏ ల రిలే నిరాహార దీక్ష పాకలపాడు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం – ప్రజలకు అవగాహన కల్పించిన సీఐ రేవతమ్మ

పాలకొండ నియోజకవర్గంలో ఊపందుకున్న ఎ ఎస్ డిడి ఓటర్ల సవరణ

Select Suryaa Now
పాలకొండ నియోజకవర్గంలో ఊపందుకున్న ఎ ఎస్ డిడి ఓటర్ల సవరణ

​పాలకొండ, సూర్య :  పాలకొండ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని నవగాం, సింగన్నవలస 167, 228వ పోలింగ్ కేంద్రం (బూత్) పరిధిలో ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రూపొందించిన ఎ ఎస్ డిడి (Absent, Shifted, Dead, Duplicate) జాబితా ఆధారంగా అధికారులు స్థానికంగా ఇంటింటి సందర్శన (Door-to-Door Verification) నిర్వహిస్తున్నారు.

​సక్రమ ఓటర్ల వివరాల నమోదు

167, 228వ పోలింగ్ కేంద్రం పరిధిలో నివసించకుండా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్ళినవారు, మరణించినవారు, ఒకే పేరుతో వేర్వేరు చోట్ల నమోదు కాబడిన ఓటర్లను  క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా తొలగించేందుకు బిఎల్ఓలు (BLO - బూత్ లెవెల్ అధికారులు) ప్రతి ఇంటికీ వెళ్తున్నారు. తుది ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతోందని అధికారులు వెల్లడించారు.
​ఓటర్లకు అధికారుల సూచనలు*
ఇంటింటికి వచ్చే బిఎల్ఓలకు ప్రజలు సహకరించాలని, తమ ఓటు వివరాలను పరిశీలించుకోవాలని అధికారులు కోరారు. ఒకవేళ అర్హత ఉన్న ఓటర్ల పేర్లు పొరపాటున ASDD జాబితాలో చేరి ఉంటే, తగిన ఆధారాలతో వెంటనే ఫారమ్-6 లేదా ఫారమ్-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామీణ మరియు వార్డు సచివాలయాల్లోనూ, అలాగే జిల్లా అధికారిక పోర్టల్ ద్వారా కూడా ఈ జాబితాను పరిశీలించుకునే వెసులుబాటు కల్పించారు.

 

రిపోర్టర్ : రమణ మూర్తి నాయుడు, పాలకొండ, పార్వతీపురం మన్యం.