ఒకటో వార్డులో జనసేన అభ్యర్థి శివశంకర ముమ్మర ప్రచారం
మదనపల్లి,మేజర్ న్యూస్ : పట్టణంలోని ఒకటవ వార్డు నందు కూటమి పార్టీల జనసేన అభ్యర్థి పసుపులేటి శివశంకర ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ప్రజలు తనకు అవకాశం ఇస్తే మీ సమస్యలను నా సమస్యలుగా భావించి వాటి పరిష్కారానికి తనవంతు పరిష్కరించడానికి ఎప్పుడు ముందు ఉంటానన్నారు.కావున ఒకటవ తేదీ జరిగే మున్సిపల్ ఎన్నికలలో చైర్మన్ అభ్యర్థిగా శ్రీరామ్ చినబాబును ఒకటో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా జనసేన తరఫున పసుపులేటి శివశంకర్ను అమూల్యమైన ఓటుతో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.అమ్మచెరువుమిట్ట నందు గల ప్రైమరీ స్కూల్ నందు పెట్రోల్ బంక్ ఎదురుగా ఓటుహక్కును వార్డు ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి