నందిగాం మండలంలో టీడీపీలోకి వైసీపీ శ్రేణులు
.. మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో పార్టీలో చేరికలు
*నందిగాం, అక్టోబర్ 15, మేజర్ న్యూస్:
తెలుగుదేశం పార్టీపై నమ్మకంతో, కూటమి ప్రభుత్వ పాలనకు ఆకర్షితులై వైకాపాకు చెందిన నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు ,నందిగాం మండలం మొండి రాయివలస పంచాయతీ పరిధిలోని పలువురు నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
నందిగాం మండలంలోని కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి మంత్రి అచ్చెన్నాయుడు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజా సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు.
తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీరియల్ నాయకులు అజయ్ కుమార్, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు