నివగాంలో న్యాయవిజ్ఞాన సదస్సు.
కొత్తూరు నవంబర్ 17(మేజర్ న్యూస్ ) కొత్తూరు మండలం నివగాం జడ్ పి ఉన్నత పాఠశాల ఆవరణలో జూనియర్ సివిల్ జడ్జి కందికట్ల రాణి అధ్యక్షతన న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.నివగాం ఉన్నత పాఠశాల విద్యార్థులకు చట్టాలుపై అవగాహన కల్పించేందుకు న్యాయ విజ్ఞాన
సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జడ్జి కందికట్ల రాణి
మాట్లాడుతూ ముఖ్యంగా బాలల పై అత్యాచార నిరోధక చట్టం (పొక్సో చట్టం) బాల్యవివాహల చట్టం గూర్చి వివరించారు. మాదక ద్రవ్యాలు
అక్రమ రవాణా , నిషేధం వంటి అంశాలు ,వీటి బారిన పడితే ,ఎటువంటి నష్టం జరుగుతుందో ,విద్యార్థులకు అవగాహన కల్పించారు .సమాజంలో పిల్లలు చెడువ్యసనాలకు గురికాకుండా బాగా విద్యనభ్యశించి ఉన్నత శిఖరాలకు చేరుకొని సమాజాభివృద్ధికి పాటు పడేవిధంగా ఉత్తమ పౌరులు గా ఉండాలన్నారు. చెడు అలవాట్లు గురైతే ,శిక్షలు పడే చట్టాలు గూర్చి వివరించారు.
సెల్ ఫోన్లు వినియోగం వల్ల లాభ నష్టాలు గూర్చి వివరించారు.కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రసిడెంట్ సి హెచ్ రవి కిరణ్,ఏ జి పి యం అప్పారావు,ఫల్గుణరావు ,ఆర్ రాజు , జడ్ పి ఉన్నత పాఠశాల హెచ్ యం గెడ్డవలస రాఘవదాస్ ఉపాధ్యాయులు విద్యార్థులు ఇతర న్యాయవాదులు ,కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.