BREAKING
నవంబర్లో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తాం తాహసిల్దార్ రాంప్రసాద్ రాజు అడివి శేష్ చేతుల మీదుగా ‘చీన్ టపాక్ డమ్ డమ్’ ఫస్ట్ క్రాకర్ విడుదల.. నవ్వుల పంట పండించేందుకు సిద్ధమైన విలేజ్ టాకీస్! నూతన ఎరువుల విక్రయ విధానం (ఎఫ్ ఎఫ్ ఎస్ )పై శిక్షణ మరియు సమీక్ష సమావేశం జిల్లా వ్యవసాయ అధికారిణి పి. సత్యవాణి 21వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరవధిక దీక్ష. ఉండి రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడోత్సవాల్లో ప్రతిభ కనబరిచిన గిరిజన గురుకులం విద్యార్థులు... వృద్ధాశ్రమంలో శ్రీకృష్ సేవా సమితి అన్నదానం తీరు మార్చుకోకుంటే మీ సంగతి తేలుస్తాం - జగన్ కు, వైసీపీ నాయకులకు మంత్రి సవిత హెచ్చరిక బలిజ సంగీయులు ఐక్యంగా ఉండాలి ఈనెల 25న బలిజ చైతన్య సదస్సు దసరా భక్తజన సందోహానికి ఇంద్రకీలాద్రి సిద్ధం! శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో వైభవంగా కాత్యాయని వ్రతం పీజీ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలి తేజ సజ్జ హోస్ట్‌గా సరికొత్త మైండ్ గేమ్ షో.. ‘ది ట్రైటర్స్’ ట్రైలర్ విడుదల! జడ్పిహైస్కూలు సందర్శించిన విద్యాశాఖ అధికారులు: ఇంకొల్లు 13 అంగన్వాడీ కేంద్రంలో ఫస్ట్కాహార మాస ఉత్సవాలు నారాయణస్వామి దేవస్థానంలో వైభవంగా వరుణయాగం

నిర్వాసితులను ఇబ్బందులకు గురిచేసి చంద్రబాబు చేసేది అభివృద్ధా..?

Select Suryaa Now
నిర్వాసితులను ఇబ్బందులకు గురిచేసి చంద్రబాబు చేసేది అభివృద్ధా..?

గన్నవరం, అక్టోబర్ 5, మేజర్ న్యూస్ ప్రతినిధి :గన్నవరం విమానాశ్రయ విస్తరణ పేరుతో బలహీన వర్గాల కుటుంబాలను ఇబ్బందులకు గురిచేసి చంద్రబాబు ప్రభుత్వం చేసేది అభివృద్ధా? అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ ప్రశ్నించారు. గన్నవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద విమానాశ్రయ విస్తరణలో ఇళ్లు, ప్లాట్లు కోల్పోయిన నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఎనిమిదో రోజు దీక్షకు అక్కినేని వనజ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గన్నవరం విమానాశ్రయ అభివృద్ధి పేరుతో అల్లాపురం, బుద్ధవరం, దావాజీగూడెం గ్రామాల్లోని ప్రజల భూములు తీసుకున్నారని తెలిపారు. ఇళ్లు, ప్లాట్లు కోల్పోయిన నిర్వాసితులకు అనేక హామీలు ఇచ్చి 12 ఏళ్లు గడిచినా న్యాయం చేయకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వం కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తూ కాలయాపన చేస్తోందని ఆరోపించారు. సుమారు వెయ్యి దళిత కుటుంబాలను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుంటే మంత్రి అనగాని సత్యప్రసాద్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ‘ఛలో సీఎం’ కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకువస్తామని అక్కినేని వనజ హెచ్చరించారు

.గుర్రం ప్రసాద్,గన్నవరం