BREAKING
కొడవలూరు మండలానికి పల్లె పండుగ 3.0లో రూ.2.06 కోట్ల పనులు శ్రీశైలంలో నందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అద్దంకిలో ఈనెల 9న ప్రజాస్వామ్య ఎన్నికల ర్యాలీ. ఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి సంస్థ పెద్దపీట 2450 మంది కి సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బి.ఎన్ విజ్ఞాన్ ఉన్నత పాఠశాలలో ‘సేవా సంకల్ప్ అభియాన్’ పోటీలు ఇంటి ముంగిట అక్షరం... ఉమ జీవితంలో వెలుగుల విప్లవం! భూ సేకరణ పెండింగ్‌ అంశాలను త్వరగా పరిష్కరించాలి జలాంతర్గాముల తయారీకి అండూరిల్‌తో భారీ ఒప్పందం కడప అమీన్‌పీర్ దర్గా ఉర్సుకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ అప్‌డేట్.. కోలుకుంటున్న వైనంపై ఎమోషనల్ వీడియో వైరల్ ఎస్సీ భూముల జోలికొస్తే చర్యలు తప్పవు ఆస్తి పన్ను బకాయిల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపండి - డిప్యూటీ కమిషనర్ చెన్నుడు కుమారుడి జ్ఞాపకార్థం బధిరుల పాఠశాలలో సేవా కార్యక్రమం విద్యార్థులకు గాయిటర్ పరీక్షలు

బలిజ సంగీయులు ఐక్యంగా ఉండాలి ఈనెల 25న బలిజ చైతన్య సదస్సు

Select Suryaa Now
బలిజ సంగీయులు ఐక్యంగా ఉండాలి ఈనెల 25న బలిజ చైతన్య సదస్సు

వేంపల్లె మేజర్ న్యూస్:
బలిజ సంఘీయులు ఐక్యంగా ఉండి సామాజిక అభివృద్ధికి కృషి చేయాలని కార్యక్రమ సమన్వయకర్త పసుపులేటి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక బలిజ సంఘం కార్యాలయంలో బలిజ సంఘీయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలిజ సంఘీయులు అందరూ ఐక్యంగా ఉంటేనే సంఘo,మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. గ్రేటర్ రాయలసీమ మహాబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘం బలోపేతం, యువతలో చైతన్యం, సమాజ అభివృద్ధిపై చర్చించేందుకు ఈనెల 25న ఆదివారం ఉదయం 10 గంటలకు కడపలోని మాధవి కన్వెన్షన్ హాల్ నందు కడప,అన్నమయ్య జిల్లాల బలిజ చైతన్య సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు.సదస్సుకు ప్రధాన వక్తగా నంద్యాల కు చెందిన ఆర్జీఎం శాంతిరాం విద్యాసంస్థల చైర్మన్ మిద్దె. శాంతి రాముడు హాజరై బలిజ సంఘీయులకు దిశానిర్దేశం చేయనున్నట్లు పేర్కొన్నారు. బలిజ కుల సంక్షేమం అభివృద్ధి, రాజకీయ చైతన్యమే కార్యక్రమ లక్షమన్నారు. ఈ కార్యక్రమానికి బలిజ సంఘ సభ్యులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులు రాయలసీమ అధ్యక్షుడు సమతం రాము, దేవసం గిరిబాబు, సుంకర రవిశంకర్, బండి ప్రసాద్, పల్కూరి అరవింద్, బెల్లంకొండ గోపి, హరీష్, వేంపల్లె బలిజ సంఘం గౌరవ అధ్యక్షులు కొత్తూరు రెడ్డయ్య, డాక్టర్ రంగయ్య, ప్రెసిడెంట్ కటిక చంద్రశేఖర్, కమిటీ సభ్యులు ఎద్ధుల రామచంద్ర, డాక్టర్ రాజారాం, కోలా మారుతి వరప్రసాద్, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

గండికోట షేక్ ఖదీర్, వేంపల్లె.
వైఎస్ఆర్ కడప జిల్లా.