BREAKING
నర్సీపట్నంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ భవనానికి శంకుస్థాపన పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గుమ్మిడి దంపతులకు నీలమ్మ కాలనీ సచివాలయ ఉద్యోగులు సత్కారం అలయ్ బలయ్ గోడ ప్రతి ఆవిష్కరణ. ఎస్సీ కమిషన్ సభ్యులను కలిసిన సర్పంచ్ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – జిల్లా కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మున్సిపల్ చైర్ పర్సన్ చింతకాయల పద్మావతి ఆకస్మిక తనిఖీ చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ మేడిపల్లి సత్యం. జడ్పీ చైర్‌పర్సన్ మజ్జి సిరి సహస్త్రను మర్యాదపూర్వకంగా కలిసిన గుమ్మడి సింహాద్రి. నా గెలుపు మరుపెంట పంచాయతీ ప్రజలకే అంకితం! ఎల్‌నినో ముప్పుపై రామగుండం అప్రమత్తం! బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థుల ర్యాలీ జంగులూరు వెలంపాలెం పంచాయతీలో హోరెత్తిన కూటమి ప్రచార జోరు! ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికైన అల్ఫోర్స్ విద్యార్థులు. మరుపెంట ఉప సర్పంచ్‌గా అక్కేన చిన్నమ్మి ఏకగ్రీవ ఎన్నిక

నిరుపేద కుటుంబానికి సరుకులు పంపిణీ

Select Suryaa Now
నిరుపేద కుటుంబానికి సరుకులు పంపిణీ

మానవత్వం పరిమళించిన వేళ...
*పేద కుటుంబానికి అండగా డాక్టర్ యల్లంపాటి కోటేశ్వరబాబు
*కర్మక్రియలకు రూ.5 వేల నగదు
*రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకుల పంపిణీ

                   

రెక్కాడితే కానీ డొక్కాడని ఓ నిరుపేద కుటుంబం పెద్దదిక్కును కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న వేళ, ప్రముఖ సంఘసేవకులు డాక్టర్ యల్లంపాటి కోటేశ్వరబాబు ఆపద్బాంధవుడిలా ఆదుకుని తన ఉదారతను చాటుకున్నారు. పట్టణంలోని ఓటేరు కాలువ ప్రాంతానికి చెందిన సూరి అలియాస్ బాబి (40) స్థానిక రైల్వే స్టేషన్‌లో సమోసాలు విక్రయిస్తూ భార్య లావణ్య, ఇద్దరు పిల్లలను పోషించుకునేవాడు. ఇటీవల వ్యాపార నిమిత్తం రైలులో వెళ్లిన సూరి, గూడూరు రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై సమోసాలు అమ్ముతుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

చలించిన మనసు.. నేరుగా ఇంటికి వెళ్లి భరోసా

పత్రికల ద్వారా ఈ విషాదకర వార్తను తెలుసుకున్న డాక్టర్ యల్లంపాటి కోటేశ్వరబాబు హృదయం చలించిపోయింది. కష్టాల్లో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్న సంకల్పంతో శుక్రవారం ఆయన నేరుగా ఓటేరు కాలువ ప్రాంతంలోని సూరి నివాసానికి వెళ్లారు. బాధితుడి భార్య లావణ్య, పిల్లలను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా సూరి కర్మక్రియల నిమిత్తం లావణ్యకు రూ.5 వేల నగదును ఆర్థిక సాయంగా అందజేశారు. అంతేకాకుండా, ఆ కుటుంబం ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో రెండు నెలలకు సరిపడా 26 కేజీల నాణ్యమైన సోనా మసూరి బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలను అందించారు. చలి తీవ్రత దృష్ట్యా తల్లికి, పిల్లలకు నూతన వస్త్రాలు, దుప్పట్లను పంపిణీ చేశారు. పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందవద్దని, వారి చదువులకు తన వంతు పూర్తి చేయూత అందిస్తానని భరోసా ఇచ్చారు.

సమాజానికి స్ఫూర్తిదాయకం

కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో డాక్టర్ యల్లంపాటి కోటేశ్వరబాబు ఎప్పుడూ ముందుంటారు. గతంలోనూ శ్రీకాళహస్తి పట్టణంలోని లంకమిట్ట ప్రాంతంలో ఒక నిరుపేద కుటుంబానికి ఇదే తరహాలో అండగా నిలిచి తన దాతృత్వాన్ని నిరూపించుకున్నారు. ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ భరోసానిస్తూ, భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు. సమాజంలో ఎందరో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ, స్పందించే గుణం కొందరికే ఉంటుంది. కన్నీళ్లలో ఉన్న పేద కుటుంబానికి తక్షణ సాయం అందించి, భవిష్యత్తుపై భరోసా కల్పించిన డాక్టర్ యల్లంపాటి కోటేశ్వరబాబు సేవా నిరతి ఎందరికో ఆదర్శప్రాయం, స్ఫూర్తిదాయకమని స్థానికులు, పలువురు ప్రముఖులు కొనియాడారు. VC VENKATAIAH సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి