నిరుపేద కుటుంబానికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ అండ.
కంబదూరు: ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ మానవత్వాన్ని చాటుకుంది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకున్న ఓ పేద వ్యక్తికి తదుపరి వైద్య చికిత్స, మందుల ఖర్చుల నిమిత్తం ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు. కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబానికి చేయూతనివ్వడం ద్వారా సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. కంబదూరు మండలం పి.వెంకటంపల్లి గ్రామానికి చెందిన ముదిరాజ్ రమేష్, కీర్తన దంపతులు రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న ఈ కుటుంబానికి రమేష్ అనారోగ్యం రూపంలో పెద్ద కష్టం ఎదురైంది. అకస్మాత్తుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న రమేష్‌కు వైద్య పరీక్షలు నిర్వహించగా, గుండెకు శస్త్రచికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆర్థిక స్థోమత లేకపోయినా కుటుంబ సభ్యులు, తెలిసిన వారి వద్ద అప్పులు చేసి ఎలాగోలా గుండె ఆపరేషన్ చేయించారు. అయితే శస్త్రచికిత్స విజయవంతమైనప్పటికీ రమేష్ పూర్తిస్థాయిలో కోలుకోవడానికి నిరంతర వైద్య పర్యవేక్షణ, పరీక్షలు, ఖరీదైన మందులు అవసరమయ్యాయి. ఇప్పటికే ఆపరేషన్ కోసం చేసిన అప్పులతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి మందుల ఖర్చులు మరింత భారంగా మారాయి. రోజువారీ కూలీ పనుల ద్వారా వచ్చే స్వల్ప ఆదాయంతో కుటుంబ పోషణే కష్టంగా మారిన పరిస్థితుల్లో వైద్య ఖర్చులను భరించలేక ఆ దంపతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ మానవతా దృక్పథంతో స్పందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న రమేష్ కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ట్రస్ట్ తరఫున మందుల ఖర్చుల నిమిత్తం రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో రమేష్, కీర్తన దంపతులకు అందజేశారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్య ఖర్చులు భరించలేని నిరుపేద కుటుంబానికి ఈ సాయం కొంత ఊరటనిచ్చింది. కేవలం ఆర్థిక సహాయం అందించడమే కాకుండా ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం సమాజం పట్ల బాధ్యతగా భావిస్తూ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రమేష్, కీర్తన దంపతులు మాట్లాడుతూ, తమ కుటుంబం కష్టాల్లో ఉన్న సమయంలో స్పందించి ఆర్థిక సహాయం అందించిన ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్‌కు, ట్రస్ట్ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నిరుపేద కుటుంబానికి అవసరమైన సమయంలో ఆర్థిక చేయూత అందించి మానవత్వాన్ని చాటుకున్న ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సేవలను పి.వెంకటంపల్లి గ్రామస్తులు ప్రశంసించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని కొనసాగాలని ఆకాంక్షించారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ := బోయ రంగస్వామి.