telangana
ఎమ్మెల్సీ దండే విఠల్ పరామర్శ
సూర్య, పెంచికల్‌పేట్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విఠల్ పెంచికల్‌పేట్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు శంకర్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా పరామర్శించారు.ఇటీవల కాలికి గాయం కావడంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న శంకర్ గౌడ్ నివాసానికి ఎమ్మెల్సీ స్వయంగా వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అందుతున్న వైద్య చికిత్స వివరాలను తెలుసుకుంటూ, అధైర్యపడవద్దని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటారని ధైర్యం చెప్పారు. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఈ పరామర్శ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సముద్రాల రాజన్న, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.