BREAKING
యువతరానికి స్ఫూర్తి ప్రధాత భగత్ సింగ్ ఇరు వర్గాల గొడవ - నలుగురు రిమాండ్ వ్యాపార రంగంలో కష్టపడి పనిచేస్తే మంచి అభివృద్ధి సాధించవచ్చు విజయవాడ సాంస్కృతిక వైభవానికి ప్రతీక విజయవాడ ఉత్సవ్.. శ్రీశ్రీశ్రీ ప్రాచీన శివరామ క్షేత్ర ఆలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నరసాపురం–విశాఖ డైలీ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాలి *పరికరాల పంపిణీ జోరు..!* తక్కువ నీటితో దిగుబడి వచ్చే పంటలను సాగు చేయాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. సూపర్ ఎల్‌నినో విపత్తులోనూ చీమకుర్తికి తాగునీరు అందించాం:మంత్రి నిమ్మల ‘ఈసీ’పై కాంగ్రెస్ ఫైర్..! ఐసీఎస్ఎస్ఆర్ సీనియర్ ఫెలోషిప్‌కు డా. గోపే ఎంపిక జంగారెడ్డిగూడెం రాప్ తొలగింపుపై రగడ గ్రామాభివృద్ధిలో పంచాయతీ సెక్రటరీలదే కీలక బాధ్యత: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్జీలపై అలసత్వం వద్దు నీట్ ర్యాంకర్ కార్తీక్‌కు కరాటం రాంబాబు అభినందనలు

నిర్దేశిత గడువులో అర్జీలకు పరిష్కారం చూపాలి

Select Suryaa Now
నిర్దేశిత గడువులో అర్జీలకు పరిష్కారం చూపాలి

 నిర్దేశిత గడువులో అర్జీలకు పరిష్కారం చూపాలి - జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి                                                       - కలెక్టరేట్ "మీకోసం"లో 307 అర్జీలు                                                                           సూర్య ఒంగోలు, బ్యూరో :      

​ప్రకాశం జిల్లా కలెక్టరేట్‌లోని PGRS హాల్లో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పాల్గొని, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు అర్జీలను నేరుగా స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా తమ సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చిన బాధితుల నుండి ఈ రోజు మొత్తం 307 అర్జీలు నమోదయ్యాయి. జాయింట్ కలెక్టర్ ప్రతి ఒక్కరి సమస్యను ఓపిగ్గా విని, వాటి తక్షణ పరిష్కారం కోసం సంబంధించిన విభాగాధిపతులకు మార్గదర్శనం చేశారు. అర్జీల స్వీకరణ అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ అధికారులకు పలు కీలక సూచనలు, స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. PGRS ద్వారా ప్రజల నుండి వచ్చే ప్రతి అర్జీ అత్యంత కీలకమైనదని, అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశిత కాలపరిమితిలోగా పూర్తి స్థాయిలో పరిష్కారం చూపాలని తేల్చి చెప్పారు. అర్జీలను పరిష్కరించడంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, అర్జీదారుడు పూర్తి సంతృప్తి చెందేలా క్షేత్రస్థాయి పరిశీలన పక్కాగా జరగాలని ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒకే సమస్యపై ప్రజలు పదేపదే కలెక్టరేట్ చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదని, పునరావృతమయ్యే (రీ-ఓపెన్) అర్జీల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా భూసంబంధిత, రెవెన్యూ ఇతర శాఖల మధ్య నలిగిపోయే సమస్యలలో విభాగాలు పరస్పర సమన్వయంతో వ్యవహరించి వేగవంతంగా బాధితులకు న్యాయం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.