BREAKING
టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన

నిరక్షరాస్యత నిర్మూలనం కు రోటరీ కృషి: రోటరీ అధ్యక్షులు జె సి రాజు.

Select Suryaa Now
నిరక్షరాస్యత నిర్మూలనం కు రోటరీ కృషి: రోటరీ అధ్యక్షులు జె సి రాజు.


రామభద్రపురం మేజర్ న్యూస్, అక్టోబర్ 1:


వ్యక్తి,సమాజాభి వృద్ధి విద్య ద్వారానే సాధ్యమని ,నిరక్షరాస్యత నిర్మూలనంకు అంతర్జాతీయ రోటరీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తుందని రోటరీ అధ్యక్షులు,నాయుడువలస పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె సి రాజు అన్నారు.పాఠశాలలో ప్రాధమిక విద్య -  అక్షరాస్యత కార్యక్రమంపై పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జె సి రాజు మాట్లాడుతూ సమాజంలో నిరక్షరాస్యతనునిర్మించటానికి,ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్యను అందించటానికి రోటరీ సంస్థవివిద కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు.ఈ లక్ష్య సాధన కోసం T-E-A-C-H (టీచ్)అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. దీని ద్వారా ఉపాధ్యాయులకు మద్దతు, ఈ - లెర్నింగ్,వయోజన అక్షరాస్యత,బాలల వికాసం,ఆనందకరమైన పాఠశాలలు ఏర్పాటుకు కృషి చేస్తుందన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుడ్లు,త్రాగునీరు,  క్రీడలు,నిరుపేద విద్యార్థులకుఅవసరమైన దుస్తులు,పుస్తకాలు సమకూరుస్తామన్నారు.
విద్యార్థులు క్రమశిక్షణతో విద్య నభ్యసించాలని కోరారు. నాయుడువలస పాఠశాలకు అవసరమైన ఫర్నిచర్, బీరువాలు,విద్యార్థులకు అవసరమైన కాటన్ స్కూల్ బ్యాగ్స్ ను  బొబ్బిలి రోటరీ సంస్థ సమకూరుస్తుందని అధ్యక్షులు జె సి రాజు తెలియ చేశారు . ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణం నాయుడు,వెంకట రమణ,ఉదయ కుమారి, విద్యార్థులు పాల్గొన్నారు